38.2 C
Hyderabad
April 29, 2024 21: 15 PM
Slider ఆదిలాబాద్

టెక్నికల్ విజిల్: నిర్మల్ ఆటోలకు క్యూఆర్ కోడ్

nirmal sp

నిర్మల్ లోని ఆటో డ్రైవర్ లకు ట్రాఫిక్ చట్టాల గురించి, నిబంధనల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సి శశిధర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడుతూ, త్వరలో నిర్మల్ జిల్లాలో ఆటో, టాక్సీ వాహనాలను QR కోడ్ సహాయంతో కంట్రోల్ రూమ్ కు అనుసంధానం చేస్తామని చెప్పారు.

వీటిని అన్ని పోలీస్ స్టేషన్ లకు అనుసంధానం చేస్తామని ఆయన తెలిపారు. మొదటగా ఆటో, టాక్సీ వాహనాల డ్రైవర్లు తమ తమ వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలసి ఉంటుందని ఎస్సీ తెలిపారు  అందుకు వారు 1) ఇన్సూరెన్స్/ పొల్యూషన్, 2)ఓటర్ ఐడి./ఆధార్ కార్డు, 3) డ్రైవింగ్ లైసెన్సు, 4)కరెంట్ బిల్/గ్యాస్ బిల్ జిరాక్స్ కాపీలను, రెండు కలర్ ఫొటోలను ఇవ్వవలసి ఉంటుందని ఆయన తెలిపారు.

QR కోడ్ సహాయంతో కంట్రోల్ రూమ్, అన్ని పోలీస్ స్టేషన్ లకు అనుసంధానం చేయడం వల్ల వాహనాలలో ప్రయాణించే వారు డ్రైవర్ పై ఏమైనా అనుమానం వస్తే వెంటనే తమ మొబైల్ ఫోన్ లో QR కోడ్ ఇన్-స్టాల్ చేసుకుని ఎమర్జెన్సీ, టెక్స్ట్, కంప్లయింట్ అను వివిధ రకాల ద్వారా సంబంధిత కంట్రోల్ రూమ్, పోలీసు స్టేషన్ వెంటనే సమాచారం వెళుతుందనిఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పట్టణ సి.ఐ. జాన్ దివాకర్, ఎస్బీ ఇన్స్పెక్టర్ వెంకటేష్, ట్రాఫిక్ ఎస్.ఐ., దేవెంధర్,  ఐటి కోర్ ఇంఛార్జి మురాద్ అలీ,  ఆటో డ్రైవర్ లు, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

రైతులూ, దళారులను ఆశ్రయించి మోసపోవద్దు

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం రాజీవ్ స్టేడియంలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే .!

Satyam NEWS

ఆదిలాబాద్ అడవులను జల్లెడపడుతున్న పోలీసులు

Satyam NEWS

Leave a Comment