38.2 C
Hyderabad
April 29, 2024 20: 39 PM
Slider విజయనగరం

పోలీసులు వాడే వెపన్స్ ను స్వయంగా చూపించిన పోలీసు బాస్

#policewepon

మీరెప్పుడైనా…పోలీసులు ఆయుధాలను కళ్లారా చూసారా…? వాళ్ళు స్వయంగా ఉపయోగించిన ఆయుధాలేంటో తెలుసుకోవాలని ఉందా..? ఆ ఎవ్వరికీ తెలియదండీ…గూగుల్ లో సెర్చ్ చేస్తే క్షణాల్లో తెలుసుకోవచ్చని అంటే మీ ఇష్టం. కానీ వాటికి లైసెన్స్ ఉండాలి.. వాడిన బుల్లెట్లకు రికార్డ్ మెయింటైన్ చెయ్యాలి.. ఇంత తతంగం ఉంటుంది.

అయితే.. సోది ఆపి విషయానికి వచ్చేస్తున్నా…ప్రతీ ఏడాది లానే ఈ ఏడాది కూడా విజయనగరం పోలీసు బ్యారెక్స్ లో ఓపెన్ హౌస్ నిర్వహించింది…పోలీసు శాఖ. బాస్ ఆదేశాలతో ఏఆర్ విభాగం ఆధ్వర్యంలో ఆర్మర్డ్ అడ్మిన్ చిరంజీవి.. ఆర్మర్డ్ ఇన్ స్పెక్టర్లు నాగేశ్వరరావు తదితర సిబ్బంది అంతా…పోలీసు శాఖ వాడుతున్న వెపన్స్ ను విజయనగరం బ్యారెక్స్ లో ఓపెన్ హౌస్ ను ఎస్ఐ దీపికా ప్రారంభించారు.

ఈ సందర్భంగా వివిధ పాఠశాల ల నుంచీ వచ్చిన స్టూడెంట్స్ కు ఎస్పీనే స్వయంగా వెపన్స్ గురించి వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ దీపికా మాట్లాడుతూ… ఈ ఓపెన్ హౌస్ లో తాము ఉపయోగించే ఆయుధాలను ప్రజల సందర్శనిర్ధం ప్రదర్శన గా ఉంచామన్నారు.అల్లర్లలో.ఆందోళన లో..ధర్నా లలో ప్రజాప్రతినిధులు రక్షణ లో సరిహద్దు ల కాపాడటంలో అలాగే కూంబింగ్ లలో పోలీసు శాఖ వాడే ఆయుధాలైన ఏకే 47,తపంచా ,పిస్తోల్..రైఫిల్.స్టన్ గన్ ఎస్ఎల్ఆర్ జంగిల్ డ్రెస్ వంటి ఉంచామని ఎస్పీ దీపికా ఈ సందర్భంగా తెలియజేసారు.

Related posts

పేదలను ఆదుకునే దేవుడు ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

డేంజర్ బెల్స్: మన రాజ్యాంగం ప్రమాదంలో పడిందా!

Satyam NEWS

పేద  ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం భరోసా

Satyam NEWS

Leave a Comment