32.2 C
Hyderabad
May 8, 2024 13: 00 PM
Slider నల్గొండ

భద్రత చెక్కులు అందజేసిన డిఐజి రంగనాధ్

#Nalgondapolice

పోలీస్ భద్రత పథకం పోలీస్ కుటుంబాలలో కొత్త వెలుగులు నింపుతూ, ఆర్థిక భరోసా కల్పిస్తుందని డిఐజి ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు.

శుక్రవారం నల్లగొండ జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల మరణించిన కానిస్టేబుల్స్ ఎం.డి. ఇస్మాయిల్ సతీమణి తాహెరా బేగంకు 2,22,152 రూపాయల చెక్కును, ఎం. శివరాజ్ తల్లి బుచ్చమ్మకు 3,96,640 రూపాయల చెక్కు, ఏ.ఆర్. హెడ్ కానిస్టేబుల్ మల్లేశం సతీమణి ఉషకు 3,97,900 రూపాయల చెక్కును ఆయన అందచేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చనిపోయిన పోలీసుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని ఆయన చెప్పారు. అదే విధంగా భద్రత స్కీమ్ ద్వారా చనిపోయిన పోలీస్ కుటుంబాలకు ఆర్థిక భరోసా కలుగుతుందని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, డిపిఓ ఏ.ఓ. మంజు భార్గవి, సూపరింటెండెంట్ కె. దయాకర్ రావు, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు జయరాజ్, రాష్ట్ర నాయకులు సోమయ్య తదితరులున్నారు.

Related posts

ఉత్తమ్ కుమార్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలి

Satyam NEWS

ఉద్యోగులను కట్టుబానిసలుగా చూస్తున్నారు: కోదండరాం

Satyam NEWS

కేసీఆర్ ను కాపాడలేకపోయిన దళిత బంధువులు

Satyam NEWS

Leave a Comment