38.2 C
Hyderabad
April 28, 2024 20: 48 PM
Slider నిజామాబాద్

పీస్ ఫుల్: ప్రశాంతంగా ముగిసిన పుర ఎన్నికలు

kamareddy polling

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లాలోని 188 పోలింగ్ కేంద్రాల్లో ప్రజలు అధిక సంఖ్యలో తరలి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 70.43 శాతం పోలింగ్ నమోదైంది. కామారెడ్డి జిల్లాలోని కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన వృద్ధులు, వికలాంగులకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

వికలాంగులను వీల్ చైర్లలో పోలింగ్ కేంద్రానికి తీసుకురాగా వృద్ధులకు ప్రత్యేకంగా ఆటోలలో తీసుకువచ్చి ఓటు వేసిన అనంతరం తిరిగి సురక్షితంగా ఇంటికి పంపించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం ఓటింగ్ సరళిని పరిశీలిస్తే కామారెడ్డి మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించున్న ఓటర్లు మొత్తం 57949 మంది కాగా ఇందులో పురుషులు 27650, స్త్రీలు 30298, ఇతరులు ఒక్కరు ఉన్నారు. కామారెడ్డిలో ఓటింగ్ శాతం 65.53% పోలింగ్ నమోదైంది.

బాన్సువాడ మున్సిపాలిటీలో మొత్తం ఓటుహక్కు వినియోగించుకున్నవారు 15013 మంది కాగా అందులో పురుషులు 7282 స్త్రీలు 7731 ఉన్నారు. ఓటింగ్ శాతం 77.07% నమోదైంది. ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో మొత్తం ఓటుహక్కు వినియోగించుకున్నవారు 9694 మంది కాగా ఇందులో పురుషులు 4712, స్త్రీలు 4982 ఉన్నారు. ఓటింగ్ శాతం 80.35% గా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా చూస్తే మొత్తం ఓటుహక్కు వినియోగించుకున్నవారు 82656 మంది ఉండగా పురుషులు 39644, స్త్రీలు 43011, ఇతరులు ఒక్కరు ఉన్నారు. మొత్తం ఓటింగ్ శాతం 70.43% నమోదైంది. చెదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

సేఫ్ హ్యాండ్స్: కరోనా కట్టడికి ముందస్తు చర్యలు

Satyam NEWS

జనవరి 5,6,7 తేదీలలో రాజమండ్రిలో అంతర్జాతీయ తెలుగు మహాసభలు

Satyam NEWS

పోలీసుల సాయంతో చెలరేగిపోయిన దొంగలు

Satyam NEWS

Leave a Comment