39.2 C
Hyderabad
May 3, 2024 12: 04 PM
Slider నిజామాబాద్

వచ్చే ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీచేస్తా

#kapal

మార్పు కోసమే ప్రజాశాంతి పార్టీని ఏర్పాటు చేశానని కేఏ పాల్ ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో ఎంపీ,ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తనవద్ద ఎలాంటి అక్రమ సంపాదన లేనందునే తనపై ఎలాంటి రైడ్స్ జరగడం లేదని కేఏ పాల్ వెల్లడించారు. ప్రపంచ శాంతి సభలకు ఎందుకు అనుమతివ్వలేదని ఆయన ప్రశ్నించింది. బండి సంజయ్ పాదయాత్రకు అనుమతెలా ఇచ్చారు?అని కేఏ పాల్ నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ గా మార్చడంపైనా కేఏ పాల్ స్పందించారు. కేసీఆర్ పార్టీ పేరు నుంచి తెలంగాణ పదాన్ని ఎందుకు తొలగించారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ వంటిదని విమర్శించారు. బీజేపీలో చేరనందుకే ఈడీ, సీబీఐ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో 60 నుంచి 70 శాతం ప్రజలు తననే కోరుకుంటున్నారని కేఏ పాల్ అన్నారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు.

Related posts

కామారెడ్డి జిల్లా కేంద్రానికి రానున్న ఎమ్మెల్యే రఘునందన్ రావు

Satyam NEWS

మంత్రి కేటీఆర్ పర్యటన కోసం ఖమ్మం పోలీసుల భారీ భద్రత

Satyam NEWS

నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు

Bhavani

Leave a Comment