28.7 C
Hyderabad
April 28, 2024 09: 16 AM
Slider నిజామాబాద్

ఏసీబీ వలలో చిక్కిన వ్యవసాయ అధికారి

#acb

బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఫర్టిలైజర్, పెస్టిసైడ్ షాపు లైసెన్స్ రెన్యూవల్ కోసం బిచ్కుంద వ్యవసాయ అధికారి 20వేల రూపాయలు డిమాండ్ చేయగా వేరే షాపు యజమానికి ఇవ్వాలని తెలపగా పదివేల రూపాయలు ఇస్తుండగా ఆ వ్యక్తిని, వ్యవసాయ అధికారిని ఏసీబీ అధికారులు అదుపులో తీసుకొని మంగళవారం కేసు నమోదు చేశారు.

నిజామాబాద్ యాంటీ కరప్షన్ బ్యూరో డీఏస్పి ఆనంద్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం బిచ్కుంద మండల కేంద్రంలో నిర్వహిస్తున్న అన్నదాత పెస్టిసైడ్స్ ఫర్టిలైజ్ దుకాణ యజమాని గుండె కల్లూరు గంగాధర్ తన దుకాణ లైసెన్స్ రెన్యూవల్ కోసం బిచ్కుంద వ్యవసాయ అధికారి పోచయ్య దగ్గరికి వెళ్లగా 20వేల రూపాయలు డిమాండ్ చేశారని 18 వేలకు ఒప్పందం కుదుర్చుకొని 8 వేల రూపాయలు ఇవ్వగా 10 వేల రూపాయలు తొందరగా ఇవ్వకుంటే షాపుపై కేసులు నమోదు చేస్తానని బెదిరింపులకు పాల్పడి వ్యవసాయ అధికారి పోచయ్య ఒత్తిడి తేగా గంగాధర్ ఈ నెల 7వ తారీఖున ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేసాడని తెలిపారు.

మంగళవారం ఏసీబీ అధికారులు ఇచ్చిన డబ్బులను తీసుకొని గంగాధర్ వ్యవసాయ అధికారి పోచయ్య ఇంటికి వెళ్లగా డబ్బులు వేరే ఫర్టిలైజర్ షాప్ లో పనిచేస్తున్న వ్యక్తికి ఇవ్వాలని సూచించడంతో గత 15 రోజులుగా నిఘా ఏర్పాటు చేసిన ఏసీబీ అధికారులు వ్యవసాయ అధికారి సూచించిన వ్యక్తికి బాధితుడు గంగాధర్ డబ్బులు ఇస్తుండగా అతనిని పట్టుకొని వ్యవసాయ అధికారి పోచయ్యను అదుపులో తీసుకున్నమని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు అడుగుతే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫిర్యాదు చేయాలని ఈ సందర్భంగా డిఎస్పి ఆనంద్ కుమార్ సూచించారు. ఆయన వెంట సిఐలు శ్రీనివాస్, నగేష్, సిబ్బంది ఉన్నారు.

జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం.

Related posts

తెలంగాణలో టిడిపిని బతికిద్దాం రండి

Satyam NEWS

ప్రత్యేక హోదా కోసం కాలర్ పట్టుకుంటామని చెప్పి … కాళ్లు పట్టుకున్నారు

Bhavani

రాఫెల్ ఫైటర్ జెట్ ల కొనుగోలులో ముడుపులు?

Satyam NEWS

Leave a Comment