42.2 C
Hyderabad
April 30, 2024 16: 10 PM
Slider నల్గొండ

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో పేద, మధ్య తరగతి ప్రజలు ఊసే లేదు

#cpmhujurnagar

కేంద్ర ఆర్థికమంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండల అమరవరం గ్రామంలో శాఖా సమావేశంలో పాల్గొన్న  సిపిఎం పార్టీ మండల కార్యదర్శి పోసనబోయిన హుస్సేన్ మాట్లాడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తిగా ప్రజా వ్యతిరేక బడ్జెట్ గా ఉందన్నారు.

పార్లమెంట్ లో ప్రవేశ పెట్టిన 2022 – 2023 సంవత్సరానికి 3945000 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజావ్యతిరేక బడ్జెట్ అని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల మూలంగా ఇప్పటికి ధరలు ఆకాశాన్ని అంటినప్పటికి ధరల తగ్గింపుకు తీసుకుంటున్న చర్యల గురించి ప్రస్తావన లేకపోవడం దురదృష్టకరమన్నారు.

మరో ప్రక్క రోజురోజుకు పెట్రోలు,డీజిల్,గ్యాస్ ధరలు పెరిగి పేద,మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే వాటినుండి ప్రజలను బయట పడే చర్యల గురించి ప్రస్తావన లేకపోవడం సరికాదన్నారు.దేశంలో 15 కోట్ల మంది వ్యవసాయ కార్మికులకు ఉపయోగపడే ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో తగిన  విధముగా కేటాయింపులు లేకపోవడం దురదృష్టకరమన్నారు.ఆర్థిక మాంద్యం నుండి దేశాన్ని ఎలా బయట పడేస్తారో బడ్జెట్లో పేర్కొనలేదని అన్నారు.ఇది ముమ్మాటికీ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని అన్నారు.బడా పారిశ్రామికవేత్తలకు శత కోటీశ్వరులకు పెద్దపీట వేసే విధంగా ఉంది తప్ప,సామాన్య,మధ్య తరగతి ప్రజలకు నిరాశాజనకంగా ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో శాఖ కార్యదర్శి షేక్.ఖాసి,కదిర నరసమ్మ,ఎన్నం కృష్ణారెడ్డి,షేక్.సైదా కందుల వీరస్వామి, తేనే సీతారాములు,తేనే బాల సైదులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సర్దార్ వల్లభభాయి పటేల్ సేవలు చిరస్మరణీయం

Satyam NEWS

రిపోర్ట్ అందిన వెంట‌నే కొద్ది గంట‌లలోనే….క‌ట‌కాల వెన‌క్కి నిందితులు…!

Satyam NEWS

Natural Menopause High Blood Pressure Remedies Progesterone Only Pills For Hypertension Natural Ideas To Lower Blood Pressure

Bhavani

Leave a Comment