24.7 C
Hyderabad
March 26, 2025 10: 17 AM
Slider హైదరాబాద్

నిత్యావసరాలు అందించిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే

#MLA Maganti Gopinath

లాక్ డౌన్ ప్రారంభమైన నాటి నుంచి ప్రతి రోజూ నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు సరఫరా చేస్తున్న హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నేడు నిత్యావసర వస్తువులు అందచేశారు. యూసుఫ్ గూడ డివిజన్ లోని ఎల్ ఎన్ నగర్ లో నీరు పేదలకు ఆయన నేడు నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు లాక్ డౌన్ కచ్చితంగా పాటించాలని అనవసరంగా రోడ్లపైకి రావద్దని కోరారు. దేశంలోనే కరోనా కట్టడి చేయడం లో తెలంగాణ రాష్ట్రం బెస్ట్ గా ఉందని ఆయన అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 29 వరకు ప్రజలందరూ లాక్ డౌన్ పాటించాలని, కారోనా మహమ్మారిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు రాజ్ కుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఖాకీల‌కు క‌రోనా వాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌….27 వ‌ర‌కు…!

Satyam NEWS

నరసరావుపేట నుంచి అరుణాచలంకు ప్రత్యేక బస్సు

Satyam NEWS

అంతర్జాతీయ మార్కెట్ లో భారీగా తగ్గిన క్రూడాయిల్ ధర

mamatha

Leave a Comment