31.2 C
Hyderabad
May 3, 2024 01: 42 AM
Slider ప్రత్యేకం

జర్నలిస్ట్ శివ కు బూతుల పంచ్ ప్రభాకర్ వార్నింగ్

#punchprabhakar

ఆదాన్ డిజిటల్ మీడియా కు చెందిన జర్నలిస్ట్ శివ కు వివాదాస్పద సోషల్ మీడియా స్పెషలిస్టు, వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వీర అభిమాని అయిన పంచ్ ప్రభాకర్ వినలేని బూతులతో కూడిన వార్నింగ్ ఇచ్చాడు. మరో కోణం అనే కార్యక్రమంలో జర్నలిస్టు శివ రాజకీయ, సామాజిక, తదితర అంశాలపై తనదైన శైలిలో విశ్లేషణ చేస్తుంటాడు.

జర్నలిస్ట్ గా విశ్లేషణలు చేస్తున్న జర్నలిస్ట్ శివ కు పంచ్ ప్రభాకర్ నుంచి వార్నింగ్ వచ్చింది.. ఒరేయ్ శివా లం…డకా నా మీద  వీడియోలు చేస్తావా అంటూ

అసభ్య పదజాలంతో తిట్ల పురాణం అందుకున్నాడు. ‘‘నిన్ను లేపేస్తా అంటే చంపేస్తా రా’’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. కేవలం బూతులతోనే ఫేస్ బుక్ లో పాపులర్ అయిన పంచ్ ప్రభాకర్ పై ఇప్పటికే పలు కేసులు నమోదు అయి ఉన్నాయి. జర్నలిస్ట్ గా నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా మీ భాష సరిగా లేదండీ.. అంటూ జర్నలిస్ట్ శివ ఆయనకు సమాధానం ఇచ్చారు.

నిజాలు నిర్భయంగా మాట్లాడగలిగే జర్నలిస్టులు చాలా మంది సమాజం కోసం కుటుంబ సంక్షేమాన్ని కూడా వదిలి పనిచేస్తున్నారు…మరి ఇలా మాట్లాడితే ఇలా ఎంతమంది జర్నలిస్టులను చంపుకుంటు వెళ్తారో…………… అని జర్నలిస్టులు అనుకుంటున్నారు. ఏదిపడితే అది మాట్లాడి పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాకర్ పై అంటూ జర్నలిస్ట్ మిత్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

హుజురాబాద్ ప్రజలతో కలిసి మంత్రి గంగుల కమలాకర్ మార్నింగ్ వాక్

Satyam NEWS

కాంగ్రెస్ నాయకుడు హరీశ్ రావత్ కు అస్వస్థత

Satyam NEWS

మహిళల సాధికారతే సిఎం కెసిఆర్ లక్ష్యం

Satyam NEWS

Leave a Comment