38.2 C
Hyderabad
May 1, 2024 22: 24 PM
Slider తెలంగాణ

హమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నవెర్నరీ డాక్టర్లు

Pragati_Bhavan

హమ్మయ్య చివరకు ఆ డాక్టర్లు బతికి పోయారు. కేసు నుంచి విముక్తి పొందడంతో ఆ డాక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటన ఏమిటా అని అనుకుంటున్నారా? వివరాలు ఇవి: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన అధికార నివాసమైన ప్రగతిభవన్ లోని పెంపుడు కుక్క ‘హస్కీ’  సెప్టెంబరు 10వతేదీన మరణించడంతో, ప్రగతిభవన్ అధికారులు సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 11 నెలల హస్కీ కుక్క అనారోగ్యానికి గురయిందని దాన్ని బంజారాహిల్స్ క్లినిక్ లో చేర్చామని, హస్కీ చికిత్స పొందుతూ మరణించిదని వైద్యాధికారుల నిర్లక్ష్యం వల్లే కుక్క మరణించిందంటూ ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 429 సెక్షన్ 11 (4) కింద జంతువులపై క్రూరత్వ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. పశువైద్యాధికారులు డాక్టర్ రంజిత్, లక్ష్మీ దీనికి బాధ్యులని పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. దీనిపై ఇండియన్ వెటర్నరీ అసోసియేషన్ సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తూ, పెంపుడు కుక్క మృతి కేసులో పశువైద్యాధికారులపై నమోదైన క్రిమినల్ కేసును ఎత్తివేయాలని కోరింది. కుక్క హస్కీ కళేబరాన్ని పోస్టుమార్టం చేయగా, అది సహజంగా అనారోగ్యంతోనే మరణించిందని తేలింది. దీంతో తాము ఇద్దరు పశువైద్యాధికారులపై పెట్టిన క్రిమినల్ కేసును మూసివేయాలని కోరుతూ హైదరాబాద్ సిటీ పోలీసులు స్థానిక కోర్టులో పిటిషన్ సమర్పించారు.

Related posts

మేడే జయప్రదం చేసేందుకు కార్మికులు సిద్ధం కావాలి

Satyam NEWS

ఇమ్రాన్ ఖాన్ ప్రసంగాల ప్రసారంపై నిషేధం

Satyam NEWS

ఆర్థిక వ్యవస్థను భస్మీపటలం చేసిన జగన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment