31.2 C
Hyderabad
May 3, 2024 01: 44 AM
Slider ప్రత్యేకం

ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసుల్లో కఠిన చర్యలు ఉండాలి

ఎస్సి ఎస్టీ లకు జరుగుతున్న సామాజిక అన్యాయాలు రూపుమాపేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల భాగస్వామ్యం చాలా అవసరమని జిల్లా కలెక్టర్, ఎస్సి ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ అధ్యక్షులు పి. ఉదయ్ కుమార్ అన్నారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మొదటి జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా ఎస్సి ఎస్టీల ఆర్థిక సాధికారత కై అనేక పథకాలు అమలు చేస్తుందని వీటిని సద్వినియోగం చేసుకొని జీవనోపాధి పై ఆలోచనలు పెట్టుకునే విధంగా చేస్తే నేరాలు తగ్గే అవకాశాలు ఉంటాయన్నారు.

కమిటీ సభ్యులు లేవనెత్తిన సమస్యలు సిటిజన్ సివిల్ రైట్స్ కార్యక్రమాన్ని నామ మాత్రంగా కాకుండా ప్రజల భాగస్వామ్యంతో పకడ్బందీగా అర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఎస్సి ఎస్టీలు దూరం ఉండేవిధంగ అవగాహన కల్పించాలని కమిటీ సభ్యులను కోరారు.

నాగర్ కర్నూల్ జిల్లాలో 2016 నుండి ఇప్పటి వరకు 276 ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. 30 మినహా దాదాపుగా అన్నింటికీ నష్టపరిహారం, మంజూరు చేయడం జరిగిందన్నారు.

వచ్చే సమావేశానికి ప్రజాప్రతినిధులు సైతం హాజరు అయ్యేవిధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కమిటీలో పాల్గొన్న ఎస్సి ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు శివ మాట్లాడుతుం 2016 నుండి ప్రతి సంవత్సరం కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదన్నారు.

పైగా ఎస్సి ల పై రౌడీ షీటర్ కేసులు పెరుగుతున్నాయని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. అదేవిధంగా ఎస్సి ఎస్టీ కేసుల్లో నిదితులకు శిక్షలు ఖరారు కావడం లేదని అన్నారు. భూ సమస్యలు, దళిత అమ్మాయిలను ముందు ప్రేమించి తర్వాత అబ్బాయిల తల్లిదండ్రులు దళిత అమ్మాయి అనే నెపంతో పెళ్లికి నిరాకరిస్తున్నారని దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయన్నారు.

అదేవిధంగా కమిటీ సభ్యులను రెవెన్యూ, పోలిస్ అధికారులు గుర్తించడం లేదని వారికి తగిన సూచనలు జారీ చేయాలని కోరారు. మరో సభ్యుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ ఎస్టీలు గుడుంబా తయారు చేస్తున్నారని పట్టుకొని కేసులు నమోదు చేస్తున్నారని అసలు బెల్లం వ్యాపారుల పై ఎలాంటి కెసులు నమోదు చేయడం లేదన్నారు. అదేవిధంగా గుడుంబా పెట్టకుండా మానడానికి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

ధరణి లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని, కొత్తగా నిర్మించిన మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ లలో దళిత వ్యాపారులకు అవకాశం కల్పించాలని కలెక్టర్ ను కోరారు.

ఈ సమావేశంలో ఎస్పీ కె. మనోహర్, అదనపు కలెక్టర్ రాజేష్ కుమార్, ఈ.డి.ఎస్సి కార్పొరేషన్ అధికారి రాంలాల్, డి.ఎస్పీ మోహన్ రెడ్డి, జిల్లా అధికారులు, విజిలెన్స్ కమిటీ సభ్యులు ఉప్పరి పోతరాజు, ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యం న్యూస్ . నెట్, నాగర్ కర్నూలు

Related posts

గుంటూరులో రెమిడిస్వేర్ ఇంజక్షన్ బ్లాక్ మార్కెట్ దందా

Satyam NEWS

వై ఎస్ జగన్ కు గుదిబండగా జీహెచ్ఎంసి ఎన్నికలు

Satyam NEWS

కౌంటర్: ఎన్నికలు సజావుగా సాగేందుకే ఆర్డినెన్స్‌

Satyam NEWS

Leave a Comment