ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత సమయంలో పరిష్కరించకపోతే అధికారులపై చర్య తీసుకుంటానని వరంగల్ మునిసిపల్ కమిషనర్ పమేలా సత్పతి హెచ్చరించారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం జరుగుతుంది. ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆమె సూచించారు. నిర్నీత సమయంలో ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించక పోతే మున్సిపాలిటి అధికారులు ఏవరైనా సరే సస్పెండ్ చేస్తానని ఆమె అన్నారు. నేడు ప్రజావాణి సందర్భంగా అధికారులకు మున్సిపాలిటి కమిషనర్ పమేలా సత్పతి తెలియచేశారు.
మరో వైపు రిటైర్మెంట్ కు దగ్గరలో ఉండి సస్పెన్షన్ లో ఉన్న అధికారులపై ఆమె సస్పెన్షన్ ఎత్తివేశారు. రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కూడా ఆమె నిర్ణయించారు. విధి నిర్వహణలో కఠినంగా ఉండి ఇలా అవసరమైన వారికి మానవత్వంలో సహాయం చేసే అధికారులు అరుదుగా ఉంటారని మునిసిపాలిటీ సిబ్బంది కొనియాడుతున్నారు.