32.2 C
Hyderabad
May 12, 2024 22: 54 PM
Slider విజయనగరం

విద్యార్థుల ముందే డీఈఓ ను కడిగిపారేసిన ప్రవీణ్ ప్రకాష్

#praveenprakash

రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్… ఈ ఐఏఎస్ అధికారి… ఏ శాఖకు వెళ్లినా…ఆ శాఖను నకశఖపర్యంతం..కాచి వడబోచి అందులో పని చేసే ప్రతీ ఉద్యోగిని..శాఖా పరంగా కడిగిపారేస్తారు.ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో గతంలో కేవలం హైదరాబాద్ కు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ గా పని చేసే సమయంలో ఆయన పనితీరేంటో…ఉభయ రాష్ఠ్రాలకు అప్పుడు తెలిసొచ్చింది. తాజాగా ఏపీ రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అయిన ప్రవీణ్ ప్రకాష్… అకస్మాత్తుగా విజయనగరం లో పర్యటించారు. విజయనగరం నడిబొడ్డున అతి పురాతన, ప్రఖ్యాతి గాంచిన… కస్పా హైస్కూలు, అలాగే ఏపీ మోడల్ హైస్కూల్ ను ఆకస్మికంగా డీఈవో లింగేశ్వర రెడ్డి తో తనిఖీ లు నిర్వహించారు. కస్పా హైస్కూల్ లో ఏడో తరగతి విద్యార్ధినీ ,విద్యార్థుల ముందే..జిల్లా విద్య శాఖ అధికారిని…క్లాస్ టీచర్ ను కడిగిపారేసారు…పనితీరు మార్చుకోకపోతే తాఖీదులు తప్పవని హెచ్చరించారు.

Related posts

ధరల పెరుగుదలను నిరసిస్తూ నిరసన

Sub Editor 2

చిన్నపిల్లల అక్రమ రవాణాలో తొలి మూడు స్థానాల్లో ఏపీ

Bhavani

అభిన‌వ నార‌దుడు…..స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తున్న పోలీస్ పీఆర్ఓ

Satyam NEWS

Leave a Comment