29.7 C
Hyderabad
May 3, 2024 05: 53 AM
Slider నల్గొండ

గురుకుల నాన్ టీచింగ్ సిబ్బందికి పీఆర్సీ అమలు చేయాలి

రాష్ట్రంలో వివిధ గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పీఆర్సీని ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పిసిసి జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ పాషా వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మహ్మద్ అజీజ్ పాషా మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ రెసిడెన్షియల్ గురుకులాలు,మైనార్టీ,బీసీ, ఎస్సీ,ఎస్టీ,సొసైటీల పరిధిలో గత అనేక సంవత్సరాలుగా నాన్ టీచింగ్ సిబ్బంది కాంట్రాక్ట్,ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ గురుకులాలలో సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారని,కానీ ఇంతవరకు ప్రభుత్వం వేతనాలు పెంచటం లేదని, వారికి ప్రభుత్వ ఉద్యోగాలకు ఇచ్చినట్లుగా పీఆర్సీని కూడా నేటి వరకు ఇవ్వలేదని అన్నారు.

దీనితో వీరి చాకిరీకి సరిపడా వేతనం రాక ప్రభుత్వం పీఆర్సీని కూడా నేటి వరకు అమలు చేయకపోవడంతో మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో వీరికి మాత్రం పనికి తగ్గట్టు వేతనాలు రావడంలేదని,దీనితో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఇంటి అద్దెలు,కరెంటు బిల్లులు,నిత్యావసర వస్తువులు,పిల్లల స్కూల్ ఫీజులు ఇలా అనేక ఖర్చులతో కుటుంబ పోషణ భారంగా మారి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఉద్యోగస్తులకు పీఆర్సీ ఇస్తున్నారు కానీ వివిధ గురుకులాల్లో విధులు నిర్వహిస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ కి ఇంతవరకు పీఆర్సీ ఇవ్వలేదని,గురుకులాల్లో నాన్ టీచింగ్ సిబ్బందికి చాలీచాలని వేతనాలతో కుటుంబ పోషణలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వీరికి వేతనాలు కూడా పెంచి ఇవ్వాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వివిధ గురుకులాల సొసైటీ పరిధిలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ కాంట్రాక్టు,ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం ఉద్యోగులకు గత సంవత్సరం క్రితం నుండి ఇచ్చిన విధంగా వీరికి కూడా అప్పటినుండి ఇప్పటివరకు పీఆర్సీని మొత్తం కలిపి ఏరియల్స్ తో వెంటనే ప్రభుత్వం చెల్లించాలని కోరారు.
నూతనంగా 2023 సంవత్సరంలో ఈయబోయే పిఆర్సీలో కూడా ఉద్యోగస్తులతో పాటు నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా అమలు జరిగేటట్లు చూడాలని ప్రభుత్వాన్ని మహ్మద్ అజీజ్ పాషా కోరారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

దారితప్పిన కొడుకును కడతేర్చిన కన్నతల్లి

Satyam NEWS

మంత్రి బొత్స జ‌న్మ‌దినం సంద‌ర్బంగా బ్రాహ్మ‌ణుల సేవా కార్య‌క్ర‌మం…!

Satyam NEWS

మంటలు రేపుతున్న బూతు మాటలు

Satyam NEWS

Leave a Comment