37.2 C
Hyderabad
May 2, 2024 13: 22 PM
Slider ముఖ్యంశాలు

కాంగ్రెస్, కమ్యూనిస్టులకు ప్రధాని క్లారిఫికేషన్

#NarendraModiNew

నూతన వ్యవసాయ చట్టం వల్ల దేశంలోని రైతులకు కనీస మద్దతు ధర లభించదని కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోడీ తెరదించారు.

కనీస మద్దతు ధర ఇవ్వడం మన దేశంలో కీలక అంశమని, ఆహార భద్రతలో ముఖ్యాంశమని ఆయన అన్నారు.

 దేశంలో వ్యవసాయ మార్కెట్ లను మరింత పటిష్టం చేసి కనీస మద్దతు ధర కచ్చితంగా అమలు అయ్యే విధంగా చూస్తామని ప్రధాని వెల్లడించారు.

ఫుడ్ అండ్ ఎగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 75వ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. శాస్త్రీయంగా కనీస మద్దతు ధర అందే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.

ప్రాధమిక వ్యవసాయ సంఘాలను బలోపేతం చేయడం కోసం గత ఆరు సంవత్సరాలలో ఎన్నో చర్యలు తీసుకున్నామని ప్రధాని వెల్లడించారు.

ఆ రంగంలో మౌలిక సదుపాయాలను భారీగా పెంచామని ఆయన తెలిపారు.  

Related posts

శేరిలింగంపల్లి లో చురుకుగా అభివృద్ధి కార్యక్రమాలు

Satyam NEWS

కరోనాతో పోరాడిన గరివిడి తహసీల్దార్ మృతి

Satyam NEWS

ఘనంగా శ్రీరామ నవమి పర్వదిన వేడుకలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment