37.2 C
Hyderabad
April 30, 2024 13: 20 PM
Slider ముఖ్యంశాలు

ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల వివరాలు ఉత్తర్వులు తప్పక పాటించాలి

#azeezpasha

ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజుల వివరాలు ఉత్తర్వులు తప్పక పాటించాలని టి పి సి సి రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ మహ్మద్ అజీజ్ పాషా డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఇందిరా భవన్ లో ఆయన మాట్లాడుతూ జి.ఓ.ఎమ్.ఎస్.నెం.1 తేది 1.1.1994 ప్రకారం పాఠశాలలు ఐదు శాతానికి తగ్గకుండా లాభాలను మాత్రమే ఆశించాలని ఆయన తెలిపారు. వసూలు చేసిన ఫీజుల నుంచి 50 శాతం మొత్తాన్ని ఉపాధ్యాయులకు వేతనాలుగా చెల్లించాలని, ప్రతి సంవత్సరం వార్షిక నివేదికలు,ఆడిట్ రిపోర్టు ప్రభుత్వానికి తప్పక సమర్పించాలని అన్నారు.

జి.ఓ.ఎమ్.ఎస్.నెం.42 తేదీ 30.7.2010 పి అనుసరించి ఫీజులను పెంచాలంటే డిస్ట్రిక్ట్ ఫీ రేగ్యులేషన్ కమిటీ(డి ఎఫ్ ఆర్ సి) అనుమతి తీసుకోవాలని, జి.ఓ.ఎమ్.ఎస్.నెం.246 ప్రకారం పాఠశాలల నిర్వాహణలో సమాజాన్ని భాగస్వామ్యం చేయాలని,సిబియస్ఈ చట్ట ప్రకారం ప్రతి పాఠశాలలో పేరెంట్, టీచర్ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవాలని ఉన్నట్లు గుర్తు చేశారు. ఈ అసోసియేషన్ లో ఇద్దరు తల్లిదండ్రులకు భాగస్వామ్యం కల్పించాలని,వీరిని సంప్రదించిన తరువాతనే ఫీజులను పెంచాలని ఉత్తర్వులు ఉన్నాయని అజీజ్ పాషా అన్నారు.

జి.ఓ.ఎమ్.ఎస్.నెం.91 6.8.2009 ప్రకారం వన్ టైం ఫీజుగా అప్లికేషన్ ఫీజు రూ100,రిజిస్ట్రేషన్ ఫీజుగా 500 రూపాయలు,రిఫన్డబుల్ కాషన్ డిపాజిట్ 5000 రూపాయలకు మించకుండా తీసుకోవాలని,జీవో లోని సెక్షన్ 1(సి) ప్రకారం పాఠ్యపుస్తకాలు, స్టేషనరీ,యూనిఫాం లను స్కూల్ యాజమాన్యం సూచించే దగ్గరే కొనాలన్న ఖచ్చితమైన నిబంధనలేమి పెట్టరాదని అన్నారు.

వీటి అమ్మకాలకు పాఠశాలలల్లో కౌంటర్లు ఏర్పాటు చేయరాదని,విద్యార్ధుల తల్లిదండ్రులకు నచ్చిన షాపులో కొనుగోలు చేయవచ్చని స్పష్టంగా సూచించటం జరిగిందని అన్నారు. సి&డి ఎస్ సి ఆర్ సి నెం.780 తేది 16.5.2013 సెక్షన్ 8 (1) ప్రకారంగా పాఠశాలల బోర్డులపై ఇంటర్నేషనల్,ఐఐటి,ఒలంపియాడ్,కాన్సెప్ట్,ఈటెక్నో అనే తోకలేవి తగిలించరాదని,

కేవలం పాఠశాల అని మాత్రమే పేర్కోనాలని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నప్పటికీ కొందరు అతిక్రమిస్తున్నారని అజీజ్ పాషా అన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

నరసరావుపేట స్టేడియం ను పట్టించుకోని ప్రభుత్వం

Satyam NEWS

వలసల వలలో యూరప్!

Bhavani

సిఎం సహాయ నిధికి మైక్రోసాఫ్ట్ అధినేత విరాళం

Satyam NEWS

Leave a Comment