38.2 C
Hyderabad
April 29, 2024 22: 11 PM
Slider నల్గొండ

విద్యుత్ ను ప్రైవేటీకరణ చేయడమంటే దేశ ద్రోహం చేయడమే

#jagadishreddy

విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడమంటే అది దేశ ప్రజలకు ద్రోహం చేయడమేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ  విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణకు కేంద్రం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. విద్యుత్ రంగ ప్రైవేటీకరణ దేశ ప్రజలకు చేటని, విద్యుత్ సంస్కరణలు దేశ ప్రజలకు ఊరి తాళ్ళుగా మారబోతున్నాయని, సంస్కరణల పేరుతో ప్రజల జేబులు కొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్నాళ్ళ క్రితం చెప్పిన మాటలు ఇప్పుడు నిజమయ్యాయని, ప్రైవేట్ వ్యక్తుల చేతికో, సంస్థల చేతికో డిస్కంలు వెళితే నిత్యావసర ధరల పెరగుదలకు అడ్డూ అదుపు లేకుండా పోతుందన్నారు. దీని ఎఫెక్ట్ దేశంలోని రైతాంగం,గృహ వినియోగదారులపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు.దీనికి వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు,దేశంలోని ప్రగతిశీల సంఘాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు.

Related posts

బిచ్కుందలో తైబజార్ వేలం పాటకు తగ్గిన ధర

Satyam NEWS

మృతుడి కుటుంబానికి అండగా నిలిచిన ములుగు ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

రాజధాని ప్రాంతంలో వైసీపీ నాయకులకు తీరని పరాభవం

Satyam NEWS

Leave a Comment