42.2 C
Hyderabad
May 3, 2024 18: 22 PM
Slider ప్రత్యేకం

దస్తావేజు లేఖరుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది

#ministerniranjanreddy

దస్తావేజ్ లేఖర్ల సమస్య సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. ధరణి వ్యవస్థతో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఆందోళన చంద వద్దని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం దస్తావేజు లేఖర్ల ఉమ్మడి జిల్లా సమావేశాన్ని వనపర్తి  జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 24 వేల మంది దస్తావేజు లేఖరులు వృత్తి నుండి ఉపాధి పొంది జీవిస్తున్నారని, ప్రభుత్వానికి వారి పొట్ట కొట్టే ఆలోచన లేదని ఆయన అన్నారు.

దస్తావేజుల లేఖర్లకు తప్పకుండా కెసిఆర్ న్యాయం చేస్తారని ఆయన భరోసా ఇచ్చారు. వారి డిమాండ్లను క్యాబినెట్ సబ్ కమిటీలో నేను ఉన్నానని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేస్తానన్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ధరణి వల్ల దస్తావేజు లేఖరులకు ఎలాంటి నష్టం లేదని అన్నారు. ధరణి ద్వారా రాష్ట్రంలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన భూ సమస్యలు పరిష్కారము అవుతున్నాయని ఆయన అన్నారు.

కొత్త వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు అన్ని సత్వరమే జరగవని సమయం పడుతుందన్నారు. దరి ద్వారా మీ సేవలో స్లాట్ బుకింగ్ ద్వారా భూ కొనుగోళ్లు జరుగుతున్నాయని అన్నారు. ఇంకా కొన్ని భూసమస్యలు ధరణి ద్వారా పరిష్కారం అయ్యేది ఉందని అది కూడా త్వరలో పూర్తవుతుందని వెల్లడించారు. ప్రజలకు మేలైన వ్యవస్థ తీసుకువచ్చి ఇలాంటి మోసాలకు తావులేకుండా పారదర్శకంగా అమలయ్యేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్  పాటు పడు తున్నారని అన్నారు.

దస్తావేజు లేఖర్లు  ఆందోళన చెందకుండా తమ పని తాము చేసుకుని ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శివ నాగేశ్వరరావు , జిల్లా పరిషత్ చైర్మన్ లోకనాథ్ రెడ్డి ,వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, ఉపాధ్యక్షుడు షేక్ జహంగీర్, దస్తావేజు లేఖర్లు బండారు కుమారస్వామి ,కృష్ణ గౌడ్ ,రమేష్ మధు, శేఖర్ ,నరేష్ , శ్రీనివాసమూర్తి ,జక్కుల రాములు, ఆదిల మహేందర్, శివ,  ఆంజనేయులు లతోపాటు రాష్ట్ర కార్యవర్గ ఉమ్మడి జిల్లా కార్యవర్గం ఉమ్మడి జిల్లాలోని ఐదు జిల్లాల కార్యవర్గాలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఉప్పల్ ఎమ్మెల్యే

Satyam NEWS

మహిళలను విస్మరిస్తే  అభివృద్ధి సాధించడం సాధ్యం కాదు

Murali Krishna

విదేశీ పర్యటన కు శ్రీకారం చుట్టనున్న బీజేపీ నేత రామ్ చందర్…!

Bhavani

Leave a Comment