26.7 C
Hyderabad
April 27, 2024 07: 22 AM
Slider ఖమ్మం

మహిళలను విస్మరిస్తే  అభివృద్ధి సాధించడం సాధ్యం కాదు

#cp

సమాజంలో సగభాగంగా ఉన్న మహిళలను విస్మరించి అభివృద్ధి సాధించడం సాధ్యం కాదని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు.  లింగ వివక్షత రహిత సమాజం కోసం జాతీయ ఉద్యమం -2022 ను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర పోలీస్ , మహిళ భద్రత విభాగం అధ్వర్యంలో డిసెంబర్ 25 వరకు వివిధ కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించేందుకు రూపొందించిన బ్యానర్లు, వాల్ పోస్టర్లను ఈరోజు పోలీస్ కమిషనర్  ఆవిష్కరించారు. జిల్లాలో   షీటీమ్, వుమెన్ హెల్ప్ డెస్క్ , చైల్డ్ లైన్, ఎన్జీవో, మై ఛాయిస్ ఫౌండేషన్‌  ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  మాట్లాడుతూ ప్రతిఒక్కరు మహిళా,పిల్లల అభ్యున్నతికి కృషి చేయాలని అన్నారు. మహిళ భద్రతకు అధిక ప్రాధాన్యతతో పాటు హింస లేని సమాజం కోసం, మన వంతు కృషి చేద్దామని అన్నారు. కార్యక్రమంలో సీసీఆర్బీ ఏసీపీ వెంకటస్వామి, సిసిఎస్ సిఐ నవీన్ పాల్గొన్నారు.

Related posts

రామంతపూర్ వార్డ్ ఆఫీస్ లో దీపావళి సబరాలు

Satyam NEWS

సంతోషి మాత ఆలయంలో ఉగాది పర్వదినాన మహాక్షిరాభిషేకం

Satyam NEWS

సచివాలయం లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Satyam NEWS

Leave a Comment