32.2 C
Hyderabad
May 1, 2024 23: 45 PM
Slider ఆదిలాబాద్

ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల నిషేధిత గుట్కా వేట

#prohibitedGhutka

ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల నిషేధిత గుట్కా వేట ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పలు మండలాల్లో గుట్కా విక్రయ కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నేడు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ. రెండు లక్షల పైచిలుకు నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ దాడుదల్లో ఆరుగురు గుట్కా విక్రేతలపై కేసు నమోదు చేశారు. టాస్క్ ఫోర్స్ సిఐ ఈ. చంద్రమౌళి ఆధ్వర్యంలో సంబంధిత పోలీసు అధికారులతో కలిసి జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో నేడు ఈ దాడులు జరిగాయి.

ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ అబ్దుల్లా చౌక్ వద్ద బేల మండలానికి గుట్కా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద నుండి 21 వేల నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వ్యక్తి బేల మండలానికి చెందిన  పెందుర్ మంకు (34) గా గుర్తించారు.

అనంతరం గాదిగూడ మండలం లోకారి గ్రామంలో పలు కిరాణా దుకాణాల్లో తనిఖీలు చేయగా లోకారి గ్రామానికి చెందిన  బోలేపల్లి బాలాజీ కిరాణా షాపులో రూ 8620/- ఎనిమిది వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు లభ్యమయ్యాయి.

మరో సమాచారం మేరకు ఇదే గ్రామంలో షేక్ ముజీబ్ కిరాణా షాపులో రూ. 24,510/- విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇరువురు నిందితులను నిషేధిత గుట్కా ప్యాకెట్ల తో సహా గాదిగూడ పోలీస్ స్టేషన్లో అధికారులకు అప్పగించారు.

అనంతరం స్థానిక నార్నుర్ లో పలు కిరానా షాప్ లో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి షేక్ వాజిద్ కిరాణా షాపులో రూ. 74,400/- విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. లోకండే భావ్ రావు కిరాణా షాపులో రూ. 1,06,060/-  వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఇరువురిని నిషేధిత గుట్కా ప్యాకెట్లతో సహా నార్నూర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు, అనంతరం మరో సమాచారం మేరకు ఇంద్రవెల్లి మండల కేంద్రంలో  జైస్వాల్ సుమిత్   కిరాణా షాపులో రూ.10200/- విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.

పట్టుబడ్డ గుట్కా ప్యాకెట్లు నిందితున్ని ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ సిఐ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో ఆకస్మికంగా తనిఖీలు చేసి గుట్కా విక్రేతలపై ఉక్కుపాదం మోపుతున్న ట్లు తెలిపారు.

నిషేధిత గుట్కా ఎవరు విక్రయించినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుళ్లు దారట్ల శోభన్ కుమార్, ముత్యాల రమేష్ కుమార్, కానిస్టేబుళ్లు ఆడే మంగల్ సింగ్, ఎం ఏ కరీం, ఠాకూర్ జగన్ సింగ్, సయ్యద్ రాహాత్, కాత్లే హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

సినీ దర్శకుడు మదన్ హఠాన్మరణం!!

Satyam NEWS

16 నుంచి 22 వరకు చిరంజీవి, పవన్ ల జన్మదిన వారోత్సవాలు

Satyam NEWS

డాక్టర్ చదలవాడ ను పరామర్శించిన మాజీ మంత్రి కాసు

Bhavani

Leave a Comment