28.2 C
Hyderabad
May 9, 2024 01: 39 AM
Slider వరంగల్

కల్లు గీత కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమమే

#taddytappers

అమరుల యాదిలో భాగంగా కల్లు గీత కార్మిక సంఘం ములుగు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పులి చిన్న నర్సయ్య గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెబోయిన రవిగౌడ్, ఎక్సయిజ్ సీఐ సుధీర్ కుమార్, హాస్పిటల్ సూపరిండెంట్ జగదీశ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గీత కార్మికుల హక్కుల కోసం పని చేసి అమరులు అయిన వారిని స్మరించుకుంటూ ఇలా రోగులకు పండ్లు పంపిణి చేయడం హర్షించదగ్గ విషయం అన్నారు.

జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి పులి చిన్న నర్సయ్య  గౌడ్ గుండెబోయిన రవిగౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల హక్కుల కోసం అమరుల స్పూర్తితో పోరాటాలు ఉదృతం చేస్తామని తెలిపారు. గౌడ ఆత్మీయ సమ్మేళనం లో మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కల్లు గీత కార్మిక సంగం ఆధ్వర్యంలో యుద్ధం తప్పదని అన్నారు. తక్షణమే సమస్య పరిష్కారం కొరకు ప్రభుత్వం స్పందించక పోతే సెప్టెంబర్ లో చలో ప్రగతి భవన్ కార్యక్రమం చేస్తామని అన్నారు.

తక్షణమే పెండింగ్ ఎక్స్ గ్రేషియాలు, సేఫ్టీ మోకులు, ద్విచక్ర వాహనాలు కొనుగోలుకు ప్రతి గీత కార్మికునికి లక్ష రూపాయలు లోన్ ఇవ్వాలని అన్నారు. ఏజెన్సీ లో రద్దు చేసిన సోసైటీ లను తక్షణమే పునరుద్దరణ చేయాలని డిమాండ్ చేశారు. సమస్య ల పరిష్కారం కొరకు సర్దార్ సర్వాయి పాపన్న స్పూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ గౌడ్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ పంజాల ఉదయ్ గౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్, కారుపోతుల సత్యం గౌడ్, రాజు గౌడ్, గుట్ట మీది ముసలయ్య ఆలయ ప్రచార కార్యదర్శి గుండమీది వెంకటేశ్వర్లు తో పాటు 15 మంది గీత కార్మికులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తాం

Satyam NEWS

కల్వకుర్తి సమస్యల మీద కాలు దువ్వుతున్న యువజన కాంగ్రెస్

Satyam NEWS

ఘనంగా వినాయక నిమజ్జనం

Bhavani

Leave a Comment