23.2 C
Hyderabad
May 7, 2024 22: 21 PM
Slider గుంటూరు

బీసీల నెత్తుటితో తడుస్తున్న మాచర్ల నేల..!

నరసరావుపేట కు అనిల్ కుమార్ ను ఎంపీ అభ్యర్ధిగా వైసీపీ ప్రకటించిన నాటి నుంచి బీసీల నెత్తుటితో పల్నాడు నేల నిత్యం తడుస్తోంది. పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా ఎగువ పల్నాడైన మాచర్లలో గత రెండు దశాబ్ధాలుగా కత్తులు నిత్యం కరాళనృత్యం చేస్తున్నాయి. స్ధానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామి రెడ్డిలు మాచర్ల నియోజకవర్గంలో సాగించే రాక్షస పాలనకు బడుగు బలహీన, అనగారిన, ముస్లీం మైనారిటీ వర్గాల వారు చిగురుటాకులా వణికిపోతున్నారు. నియోజకవర్గం మొత్తం పిన్నెల్లి ఇనుప పాదాలత అణగదొక్కపడుతోంది.

చివరకి చట్టం కూడా ఎమ్మెల్యే నిరంకుశత్వ చట్రాలు కింద పడి నలిగిపోతోంది. లా అండ్ ఆర్డర్ వ్యవస్ధ జీ హుజూరు అంటూ అడుగులకు మడుగులొత్తేందుకు తయారైంది. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు.., నిలదీస్తే దాడులు.. ఎదిరిస్తే హత్యలు అంటూ పిన్నెల్లి సాగిస్తున్న దౌర్జన్యకాండకు మాచర్ల ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.

సామాన్య ప్రజలతోపాటు విపక్షాలు మనుగడ మాచర్లలో సందిగ్ధం పడి భవిష్యత్తు ప్రశ్నానార్ధకంగా మారిన వేళా.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జూలకంటి బ్రహ్మానందరెడ్డిని మాచర్ల నియోజకవర్గం ఇంచార్జ్ గా ప్రకటించారు. డిసెంబర్ 22, 202 నుంచి ఆయన నియోజవకర్గంలో ఇంచార్జ్ హోదాలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అనతికాలంలోనే ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఈ నేపధ్యంలోనే పిన్నెల్లి కోటరికి ఓటమి భయం పట్టుకుంది.

ఫ్యాక్షన్ మళ్లీ జడలు విప్పి పచ్చినెత్తురు పారుదలకు ఆజ్యం పోసింది. ఆ ఆజ్యం జనవరి 13, 2022న వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, బీసీ నేత తోట చంద్రయ్యను వైసీపీ నాయకుడు, వెల్దుర్తి ఎంపీపీ చింత శివరామయ్య అండ్ టీం అతి కిరాతంగా నడిరోడ్డుపై పీక కోసి చంపారు. ఆ తరువాత అదే సంవత్సరం జూన్ 30, 2022న దుర్గి మండలం, జంగమహేశ్వరపాడులో యాదవ సామాజీకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు కంచెర్ల జెల్లయ్యను వైసీపీ నాయకుడు ఊరిబెండి మన్నెయ్య అండ్ టీం రాళ్ళు.., ఇనుప రాడ్లతో దాడి చేసి అత్యంతం అటవీకంగా హత్య చేశారు. ఈ హత్యలకు ముందు.., తరువాత పిన్నెల్లిని ప్రశ్నిస్తున్న సామాన్యుల పై, టీడీపీ నేతలపై వందల సంఖ్యలో హత్యయత్నాలు, వేలల్లో అక్రమ కేసులు పెట్టి మానసికంగా చిత్రహింసలకు గురి చేశారు.

తాజాగా ఈ నెల 15న దుర్గి మండలం కేంద్రంలో ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు, టీడీపీ కార్యకర్త జెల్లయ్య హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఊరిబెండ మన్నెయ్య.. యాదవ సామాజీకవర్గానికి చెందిన టీడీపీ కార్యకర్తలపై ఇనుప రాడ్లు, రాళ్ళలతో దాడి చేసి హత మార్చాలని చూశారు. ఆ దాడిలో గుమ్మ శ్రీను, పాశం రాజు, గాజుల అంజి లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని తెలుగుదేశం పార్టీ మాచర్ల ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి తీవ్రంగా ఖండించారు. దాడి జరిగిన రోజునే స్ధానిక ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బర్తడే వేడుకలకు నరసరావుపేట పార్లమెంట్ వైసీపీ ఇంచార్జ్ అనిల్ హాజరై.. తన సొంత సామాజీకవర్గమైన యాదవుల నెత్తురు గిఫ్ట్ గా ఇచ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా మాచర్ల నియోజకవర్గంలో అన్నీ మండలాల్లో బడుగులపై ఏదో ఒక గ్రామంలో నిత్యం దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మానవ హక్యులు నియంత పిన్నెల్లి ఇనుప చట్రాల కింద నలిగిపోతున్నా..ఇక్కడ ప్రజా సంఘాలు, కుల సంఘాలు, హక్కుల సంఘాలు నోరుమెదపకపోవడం కడు శోచనీయం. ప్రజల కూడా ఎన్నికలు ఎప్పుడొస్తాయ్.., పిన్నెల్లి రాక్షస పాలనకు చరమగీతం పాడాలని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.

Related posts

బిచ్కుంద మండలంలో అంబేద్కర్ వర్ధంతి

Satyam NEWS

స్పందన ఫిర్యాదులకు తక్షణమే పరిష్కారం చూపండి

Bhavani

మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఫైనాన్సర్

Satyam NEWS

Leave a Comment