29.7 C
Hyderabad
April 29, 2024 08: 19 AM
Slider పశ్చిమగోదావరి

బిబిసి పై కేంద్ర నిరంకుశ వైఖరికి నిరసన

#BBC

మీడియా సంస్థలపై కేంద్ర ప్రభుత్వం నిరంకుశ వైఖరి అవలంబించడం, భౌతిక దాడులకు పాల్పడటం దుర్మార్గమని ఏలూరులో పలువురు మీడియా ప్రతినిధులు పేర్కొన్నారు. బి బి సి సంస్థపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కమిటీ ఏలూరు, దెందులూరు ఫెడరేషన్ కమిటీల

ఆధ్వర్యంలో ఏలూరులోని కలెక్టరేట్ వద్ద శుక్రవారం పాత్రికేయులు ధర్నా నిర్వహించారు. అనంతరం డిఆర్ఓకి వినతి పత్రాన్ని అందించారు ఈ సందర్భంగా ఏపీడబ్ల్యుజేఎఫ్ నాయకులు మాట్లాడుతూ గుజరాత్ లో జరిగిన గోద్రా మారణ హోమంపై బీబీసీ వార్తా సంస్థ డాక్యుమెంటరీ రూపొందిందిస్తున్న కారణం పై అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నేటి దేశ

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు ఐటీ సంస్థలను వినియోగించి బీబీసీపై దాడులు చేయించడం సరైన చర్య కాదని తెలిపారు. ఇది దేశంలోని పాత్రికేయులపై జరుగుతున్న దాడిగా అభివర్ణించాల్సిన వస్తుందని పేర్కొన్నారు మీడియా సంస్థలు స్వేచ్ఛాయుత వాతావరణంలో పని చేయాలని అలా

పనిచేస్తున్న సంస్థలపై ప్రభుత్వాలు ఈ విధమైన కక్షపూరిత చర్యలకు పాల్పడడం సరికాదని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యుఎఫ్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు జబీర్ కే సోమశేఖర్ గంగరాజు.

ఏలూరు నగర అధ్యక్షులు మీసాల సూర్య శివప్రసాద్ కార్యదర్శి సుబ్రహ్మణ్యం దెందులూరు నియోజకవర్గ అధ్యక్షులు రుషి రావు, సజీ, దర్శి సత్యనారాయణ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు తెలంగాణ సహాయం

Satyam NEWS

ఇవి మిల్లులు కాదు రేషన్ బియ్యం తినేసే పందికొక్కులు

Satyam NEWS

బీజేపీ పతనం ప్రారంభం

Bhavani

Leave a Comment