24.7 C
Hyderabad
March 26, 2025 09: 13 AM
Slider మహబూబ్ నగర్

బాధిత కుటుంబాలకు బాసటగా మాజీ మంత్రి జూపల్లి

cm jupally

అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ ఎవరు సాయం చేస్తారా అని ఎదురు చూస్తున్న వారికి నేనున్నానంటూ ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు. అనారోగ్యంతో ఉన్న వారికి మెరుగైన చికిత్స అందించేందుకు నిర్దేశించిన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆయన పలువురికి నిధులు మంజూరు చేయిస్తున్నారు.

 తాజాగా 4 లక్షల రూపాయల LOC ని బాధిత కుటుంబానికి మాజీ మంత్రి జూపల్లి అందజేశారు. పాన్ గల్ మండలం తెల్లారాళ్ల పల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ కు రూ. 4 లక్షలు, పెద్దకొత్తపల్లి మండలం సాతపూర్ గ్రామానికి చెందిన బి.పార్వతమ్మ కు రూ. లక్ష, కొల్లాపూర్ మండలం యన్మన్ బెట్ల గ్రామానికి చెందిన CH.అలివెలమ్మకు రూ. లక్ష అందచేశారు.

అనారోగ్యంతో చికిత్స పొందుతున్న బాధితులకు అండగా సీఎం సహాయ నిధి ఉంటుందని ఈ సందర్భంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య బాధితులకు చికిత్స నిమిత్తం ఈ విధంగా భరోసా కల్పిస్తున్నారని ఆయన అన్నారు.

Related posts

సీరియల్ కిల్లర్: మర్డర్లే వీడికి జీవనోపాధి

Satyam NEWS

సూర్యాపేట బిజెపిలో కొత్త నేతల సందడి

Satyam NEWS

డిన్నర్ పాలిటిక్స్: రాజుగారి విందుకు అంతా సిద్ధం

Satyam NEWS

Leave a Comment