38.2 C
Hyderabad
April 28, 2024 19: 48 PM
Slider ఖమ్మం

KCR అనుచిత వ్యాఖ్యలకు రగులుకుంటున్న కార్చిచ్చు

#dalitprotest

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగం మార్చాలంటూ చేసిన వ్యాఖ్యలపై వాడవాడలా మంట రగులుతోంది. అదే విషయమై దళిత సంక్షేమ సేవ సంఘం, బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట రింగ్ రోడ్డు సెంటర్లో అంబేద్కర్ విగ్రహనికి పాలాభిషేకం చేశారు.

అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో ముఖ్య మంత్రి కేసీఆర్ పై కంప్లైంట్ ఇచ్చారు. దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం అంటూ బీసీ,ఎస్సి, ఎస్టీ అన్ని వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బ తీసే విధంగా మాట్లాడినందుకు యావత్ భారత దేశ ప్రజానీకానికి సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకపోతే దశలవారీగా ఉద్యమాన్ని బలపరుస్తామని, కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ అట్టడుగు వర్గాలకు సైతం సమన్యాయం రాజ్యాంగం ఇచ్చినదేనని వారన్నారు.

సీఎం పదవి  ప్రమాణ స్వీకారంలో భారత రాజ్యాంగం పై ప్రమాణం చేసిన   విషయం మరిచారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్లలో పిర్యాదు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో DSS జాతీయ ప్రధాన కార్యదర్శి తగరం రాంబాబు, జిల్లా దళిత సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు గొల్లమందల పెంటయ్య ,జాతీయ  మానవ హక్కుల పోరాట సమితి సీనియర్ నాయకులు కొలికి పోగు ప్రభుదేవా, రాష్ట్ర విద్యార్థి నాయకులు కొలికి పోగు ధర్మరాజు, గిద్ద కొండయ్య , జిల్లా ఫిట్ ఇండియా అధ్యక్షులు బహుజన సమాజ్ పార్టీ జిల్లా నాయకులు తగరం రాంనివాస్,  దళిత సంక్షేమ సంఘం నాయకులు, బీఎస్పీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్సీ కవితకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ఆహ్వానం

Bhavani

శాస్త్రోక్తంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి చక్రస్నానం

Satyam NEWS

పుణ్య క్షేత్రం శ్రీ మైసమ్మ దేవత ఆలయం మూసివేత

Satyam NEWS

Leave a Comment