28.7 C
Hyderabad
May 6, 2024 10: 04 AM
Slider విజయనగరం

కన్నవారి తో పాటు ఏడేళ్ళ చిన్నారి నడిరోడ్డుపై నిరసన…!

#protest

“ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు…” అన్నట్లుగ సమాజంలో సైద్ధాంతిక మార్పు రావాలంటే ఎవరో ఒకరు ముందడుగు వెయ్యాల్సిందే.అదే పని చేసింది.. విజయనగరం లో ఓ కుటుంబం. భారత రాజ్యాంగం ప్రకారం మత విశ్వాసాలను ప్రతీ ఒక్కరూ పరిరక్షించాల్సిందే. కానీ ఇతరుల కు ఇబ్బంది కలిగిస్తే సూటిగా ప్రశ్నించొచ్చు…అడగొచ్చు..అవసరమైతే నిలదీయోచ్చు అని చెప్పింది కూడా.

సరిగ్గా ఆ సూత్రాన్నే ఉపయోగించింది..విజయనగరం కు చెందిన ఓ కుటుంబం విజయనగరం నుంచే నెల్లిమర్ల కు వెళుతుండగా వేణుగోపాల పురం వద్ద ఓ ఇంటి నుంచీ ప్రతీ రోజు ప్రార్ధనలు వచ్చి… ఆ మార్గం గుండా వెళ్లే వాహనాలకు ఇబ్బందిగా పరిణమిస్తోంది. దీన్ని గుర్తించిన ఓ అమ్మ ,నాన్న వాళ్ల ఆడకుతురు కారులో వస్తు…ఆ ప్రార్ధనాలయం నుంచీ విపరీతంగా శభ్దం వస్తోందని… వచ్చే పోయే వాహనాలకు ఇబ్బంది గా ఉందని… ఏకంగా నడిరోడ్డుపై నే కారులో ఉన్న కవర్ ను తెచ్చి రోడ్ కు అడ్డంగా పరిచి దానిపైనే మండుటెండలో భైఠాయించారు.

ఆ శబ్ధం ఆపేవరకు మా కుటుంబం కదిలేది లేదని భీష్మించుకుంది. దీంతో చీపురు పల్లి వెళ్లే వాహనాలు అటు విజయనగరం వెళ్లే వాహనాలు ఆగిపోయాయి. విషయం కాస్త నెల్లిమర్ల పోలీసులకు తెలియడంతో ఎస్ఐ నారాయణ ఆదేశాలతో ఏఎస్ఐ ఘటనా స్థలికి వచ్చి..సంప్రదింపులు చేయడంతో ఎట్టకేలకు ఆ కుటుంబం అక్కడ నుంచే లేవడంతో ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు. అయితే విశేషమేంటంటే…అమ్మ ,నాన్నలతో పాటు వాళ్ళ బిడ్డ పసి ప్రాయంలో నాన్న తో పాటు ఎండలో నిరసన లో పాల్గొనడం విశేషం.

Related posts

తవాంగ్ కు చేరుకోవడానికి టన్నెల్ మార్గం రెడీ

Satyam NEWS

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభంజనం

Satyam NEWS

ఓటర్ గుర్తింపుకార్డు దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి

Satyam NEWS

Leave a Comment