29.7 C
Hyderabad
May 6, 2024 04: 30 AM
Slider నల్గొండ

దళిత బందు కోసం జరిగే ధర్నాను జయప్రదం చేయండి: కెవిపిఎస్

#dalitbandhu

దళితులందరికి దళిత బందు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27వ,తేదీన కెవిపిఎస్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ తహశీల్దార్ కార్యాలయం ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ,మండలం గోపాలపురం గ్రామం లోని దళితవాడలో శనివారం ప్రచారం నిర్వహించి దరఖాస్తులు అందించారు.ఈ సందర్భంగా కోట గోపి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దళితులను,సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చేయడం కోసం తెచ్చిన దళిత బందును దళితులందరికి ఇవ్వాలని అన్నారు. దళిత బందు లబ్ధిదారుల ఎంపిక బాధ్యతలను ఎమ్మెల్యేలు,మంత్రులకు కాకుండా జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని అన్నారు. గ్రామాలలో నివాసముండే దళితులు ఉపాధి లేక పొట్టకూటి కోసం వలస వెళుతున్నా పట్టించుకునే వారే లేరని అన్నారు. దళితులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు,పెన్షన్లు,రేషన్ కార్డులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గోపి ఆవేదన వ్యక్తం చేశారు.

దళితుల ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వాలు దళితుల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం లేదని అన్నారు.దళితుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని,మండలం లోని దళితులందరికి దళిత బందు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 27న,తాసిల్దార్ కార్యాలయం ముందు జరిగే ధర్నాకు మండలంలోని దళితులందరూ దరఖాస్తులతో తరలిరావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోషనబోయిన హుస్సేన్,ప్రజాసంఘాల నాయకులు సిద్దేల వెంకటయ్య, తిరుపయ్య,మాధవరావు,భిక్షం,గ్రామ దళితులు తురుపాటి మునేరయ్య,కిన్నెర నాగలక్ష్మి,రాములమ్మ,హనుమంతు, నాగుల్ మీరా,అనిత,సుశీల,ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్  హుజూర్ నగర్

Related posts

తెలంగాణ నుండి యూరప్ కు వేరుశనగ ఎగుమతులు

Satyam NEWS

కొన్న భూములు కాపాడుకోవటం కోసం…

Satyam NEWS

కృష్ణానదిలో రోజు రోజుకూ పెరుగుతున్న వరద

Satyam NEWS

Leave a Comment