40.2 C
Hyderabad
April 28, 2024 15: 28 PM
Slider వరంగల్

బాలికల సదనం పిల్లలకు ఉచిత నోట్ పుస్తకాల పంపిణీ

#anurag

హన్మకొండ  కలెక్టరేట్ సమీపం లోని బాలికల సదనం పిల్లలకు అనురాగ్  హెల్పింగ్ సొసైటి ఒక సంవత్సరానికి సరిపడా లాంగ్ అండ్ షార్ట్ నోట్ బుక్స్ ను ఉచితంగా అందించి తన దాతృత్వాన్ని చాటుకుంది. అనురాగ్  హెల్పింగ్ సొసైటి ప్రెసిడెంట్ డా.కె.అనితారెడ్డి నోట్ బుక్స్ ను నేడు జరిగిన ఒక కార్యక్రమంలో అందచేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద, అనాధ పిల్లలను చదువుకోవడానికి ప్రోత్సాహించాల్సిన అవసరం ఉందని అన్నారు.

అందుకోసమే గత 28 సంవత్సరాలుగా పిల్లలకు పుస్తకాలు అందిస్తున్నామని, పేదరికం విద్యకు ఎటువంటి ఆటంకం కారాదని అనితా రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా కె.అనితారెడ్డి అక్కడి  పిల్లల మంచి చెడులు అడిగి తెలుసుకోవడం జరిగింది. పిల్లల కేర్ అండ్ ప్రొటక్షన్ లో ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియచేయమని, వాటి పరిష్కారానికి తగిన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

ముఖ్యంగా  పిల్లలకు వారికి ఇష్టమైనవి ఏర్పాటు చేయడంలో కలిగే సంతృప్తి, ఆనందం మరెందులో ఉండదని, ఓ అమ్మలా ప్రేమను, ఆత్మీయ స్పర్శను అందిస్తే  పిల్లలకు మరింత ఉత్సాహం, ఉల్లాసం కలిగి తమకు అందరూ ఉన్నారన్న భరోసా, సంతోషం కలిగిస్తుందని అన్నారు. దానితో చక్కగా చదువుకొంటారని అనితారెడ్డి అన్నారు. వార్డన్ కళ్యాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

ధరణి టెక్నికల్ స్టాఫ్ కి ఉద్యోగ భద్రత కల్పించాలి

Satyam NEWS

చంద్రయాన్ – 3 ఇండియా కలలను నిజం చేయాలి

Bhavani

రఘురాముని అరెస్ట్ పై క్షత్రియుల నల్ల బ్యాడ్జీల నిరసన

Satyam NEWS

Leave a Comment