31.7 C
Hyderabad
May 2, 2024 08: 13 AM
Slider నిజామాబాద్

సీఆర్పీలకు పెరుగుతున్న మద్దతు: 24 వ రోజుకు చేరిన దీక్షలు

#kamareddy

సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్షలకు మద్దతు పెరుగుతోంది. రోజురోజుకు ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలన్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటివరకు పీ.ఆర్.టి.యు, ఎస్సి,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తపస్, పి.ఆర్.టి.యు తెలంగాణ, టీఎస్ యూటీఎఫ్, డిటీఎఫ్ ఉద్యోగ సంఘాలు సీఆర్పీల దీక్షకు మద్దతు పలికారు. 24 రోజులుగా ఆందోళన బాట పట్టినా ప్రభుత్వం స్పందించాల్సిందని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

గెజిటెడ్ పీజీహెచ్ఎంల సంఘం ప్రతినిధుల మద్దతు

సమగ్ర శిక్ష ఉద్యోగుల 24 వ రోజు రిలే నిరాహార దీక్షలు కార్యక్రమంలో భాగంగా సంఘీభావం తెలుపడానికి జిల్లా పిజిహెచ్ఎంల సంఘ నాయకులు దీక్ష శిబిరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పీజీహెచ్ఎంల అధ్యక్షులు నీలం లింగం మాట్లాడుతూ సమగ్ర శిక్ష ఉద్యోగులు విద్యాశాఖలో కీలకమైన సేవలు చేస్తున్నారని, వివిధ స్థాయిలో పనిచేసే ఉద్యోగులు అంకితభావంతో పని చేస్తూన్న వారికి 15 సంవత్సరాల నుండి చాలీచాలని వేతనాలు పనిచేయడం బాధాకరమన్నారు. ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమాలు తెలంగాణ సాధన కోసం శాంతియుత ఉద్యమం లాంటిదన్నారు.

ప్రస్తుతం విద్యా వ్యవస్థలో ఈ కాంట్రాక్టు ఉద్యోగులు 24 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్న క్రమంలో పాఠశాల, కాంప్లెక్స్, ఎంఆర్సి , డిపిఓ స్థాయిలో పనులు సక్రమంగా జరగక ఇబ్బందులు అవుతున్నాయనే అనే విషయాన్ని గుర్తు చేశారు. సీఆర్పీల సేవలు విద్యా వ్యవస్థకు పట్టుకొమ్మలుగా మారిందన్నారు. విద్యా శాఖలో వీరిని విలీనం చేసి రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఆర్పీలకు న్యాయం జరిగే  వరకు వెంట ఉండి మద్దతు ఇస్తామని తెలిపారు. అనంతరం దీక్షల నిర్వహణకు తమ వంతుగా ఖర్చులకు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.  ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు రామస్వామి, లక్ష్మీనారాయణ యోసఫ్, ఎల్లయ్య, విజయ్ కుమార్, జేఏసీ అధ్యక్షులు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సంపత్, నాయకులు, భాను ప్రసాద్, రాములు కృష్ణంరాజు, సంధ్య,  కాళిదాస్, మాధవి, శైలజ, చిరంజీవి  ఉద్యోగులు పాల్గొన్నారు.

Related posts

చైనాతో కుమ్మ‌క్కు.. ఓలికి మ‌ళ్ళీ ప‌ట్టం క‌ట్టేరా?

Sub Editor

జూన్ 5 నుండి 9 వ‌ర‌కు అమ‌రావ‌తిలో శ్రీ‌వారి ఆల‌య మ‌హాసంప్రోక్ష‌ణ

Satyam NEWS

దేశానికి నూతన ఆవిష్కరణల ఆవశ్యకత ఎంతో వుంది

Satyam NEWS

Leave a Comment