38.2 C
Hyderabad
May 2, 2024 19: 30 PM
Slider వరంగల్

వేతనాల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

#aituc

తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుండి నిరవధిక సమ్మె ప్రారంభించడం జరిగినది. అందులో భాగంగా ములుగు జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం వద్ద సమ్మెను ప్రారంభించి మాట్లాడుతున్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్, జీవో ఎంఎస్ నెంబర్ 8 డేటు 15 -2-2023 నాడు వేతనాలు పెంచుతున్నట్లు విడుదల చేసినాడు కానీ నేటికీ వేతనాలు అందలేదు అన్నారు కనుక పెంచిన వేతనాలను నాటి నుండి నేటి వరకు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు పెండింగ్ బిల్లులు కోడిగుడ్ల బిల్లులు వెంటనే చెల్లించాలని వంట కార్మికుల అక్రమ తొలగింపులను నిరోధించాలని కార్మికులకు నియామక పత్రాలు అందించి గుర్తింపు కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు

అలాగే మేనూ లో రాగి జావా కొత్తది ప్రవేశపెట్టడం జరిగింది అలాగే భవిష్యత్తులో అల్పాహారం కూడా అందిస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అవన్నీ అమలు జరగాలంటే మెనూ చార్జీలు కూడా పెంచాలని అది ప్రతి విద్యార్థికి 25 రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు అలాగే ఈనెల పాఠశాలల ప్రారంభం నుండే వంట సరుకులు మొత్తం ప్రభుత్వం సరఫరా చేస్తామని ఇప్పటికీ అమలు చేయలేదు అన్నారు కనుక పెంచాలి లేదంటే మొత్తం సరుకులు ఏమైనా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు అవి విడుదల చేసే వరకు సమ్మె కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసినారు

ఈ కార్యక్రమంలో తొమ్మిది మండలాల నుండి వంట కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు,( సమ్మె కు అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మద్దతు గా పాల్గొన్నారు, నాయకులు క్రిష్ణ కుమారి, మీనాకుమారి, సమ్మక్క,,)ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బండి నరసయ్య మండల నాయకులు జైలు పోతుల పైడి బాబు,కొక్కుల రాజేందర్,కట్ల రాజు,సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సామల రమ, గున్నాల రాజకుమారి, జనగాం శోభ,పోశమ్మ, రాంబాబు కుడుముల సమ్మక్క, పోదెం సమ్మక్క, లక్ష్మి, కమలక్క, శ్రీనివాస్,పధ్మ, సామ సమ్మక్క సరోజన,రజిత, తదితరులు పాల్గొన్నారు

Related posts

ఆసుపత్రిలో చేరనున్న ఎం ఎస్ ధోని

Satyam NEWS

వెల్లువెత్తిన సంబరాలు

Sub Editor 2

క్రాస్ ఓటింగ్ ఆరోపణలపై మేకపాటి స్పందన

Satyam NEWS

Leave a Comment