27.7 C
Hyderabad
April 30, 2024 09: 16 AM
Slider ఆదిలాబాద్

కోత పెట్టవద్దు పూర్తి వేతనాలు చెల్లించాలి

#Kagajnagar Dharna

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల విజ్ఞప్తులను పట్టించుకోకుండా వరుసగా మూడవ నెల కూడా వేతనాలు, పెన్షన్లలో కోత విధించటాన్ని నిరసిస్తూ ఆర్‌డిఒ కార్యాలయం, కాగజ్‌నగర్‌ ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ & కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిగింది.

ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం జిఓ నెం. 27 ద్వారా ఏకపక్షంగా ఉద్యోగుల, ఉపాధ్యాయుల వేతనాలు, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్లలో కోత విధించారని అన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల విజ్ఞప్తులను పట్టించుకోకుండా వరుసగా మూడవ నెల కూడా వేతనాలు, పెన్షన్లలో కోత విధించటాన్ని నిరసిస్తున్నామని తెలిపారు.

దీని వలన లక్షలాది ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారని వారన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలు సవరించి అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాలు ప్రారంభించినందున, ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతున్నందున జిఓ నెం. 27ను రద్దు చేసి పూర్తి వేతనాలు, పెన్షన్లు చెల్లించాలని వారు కోరారు.

మార్చి నెల నుండి రావల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు నాయకులు త్రివేణీ, యం. శ్రీనివాస్, ఎ. ఓదెలు మద్ధతు తెలిపి మాట్లాడారు.  ఈ సమావేశంలో వివిధ సంఘాల నాయకులు మఖ్బూల్‌ హుస్సేన్, యు. నారాయణ, వి. శాంతికుమారి, మేడి చరణ్‌దాస్‌, యం. రాజకమలాకర్‌రెడ్డి, సిహెచ్ ప్రసాద్‌, తాటి రవిందర్‌ పాల్గొన్నారు.

ఇంకా అబ్దుల్‌ ఖమర్‌, తలండి లక్ష్మణ్ , జాడి కేశవ్‌, అరీపోద్ధిన్‌, మధుసూధన్‌, పి. నాందేవ్‌, యం. మురళీధర్‌రావు, జి. పూర్ణచందర్‌ రావు, బి. నర్సయ్య, మార్త. సత్యనారాయణ, యం. సుభాష్‌, అల్లి రాజయ్య, యం. జయదేవ్‌ అబ్రహాం, శివప్రసాద్‌, మధుసూధన్‌, పి. నాందేవ్‌,భషీర్‌ అహ్మద్‌ ఖాన్‌,  పీవీ కిషన్‌రావు, డి. తులసీరాం, మహేందర్‌, యండి.  తాజోద్దిన్‌, షేక్‌ మహబూబ్‌, డి. శివకుమార్‌, సిహెచ్‌ స్వామి, తదితరులు పాల్గోన్నారు.

Related posts

కబాలి సినీ నిర్మాత చౌదరి అరెస్ట్

Bhavani

కంప్లయింట్: ఇప్పటికి ఏపి బిజెపికి సెగ తగిలింది

Satyam NEWS

బాధిత కుటుంబాలకు బాసటగా మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

Leave a Comment