39.2 C
Hyderabad
April 28, 2024 13: 04 PM
Slider ముఖ్యంశాలు

కబాలి సినీ నిర్మాత చౌదరి అరెస్ట్

#Chowdhary

డ్రగ్స్ సరఫరాదారులు, వాడకందారులపై సైబరాబాద్ పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. తాజాగా డ్రగ్స్ కేసులో ప్రముఖ సినీ నిర్మాత అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. రజనీకాంత్, రాధికా ఆఫ్టే హీరో హీరోయిన్‌లుగా నటించిన ‘కబాలి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు.

గత కొంతకాలంగా కేపీ చౌదరి గోవాలో ఉంటున్నారు.కేపీ చౌదరి మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నట్టు తేలడంతో ఆయనను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన నుంచి పోలీసులు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఎంత మొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. వారికి ఎవరు సప్లై చేస్తున్నారు. ఇందులో ఎవరెవరు ఉన్నారనేది ఇంకా తెలియాల్సి ఉంది. ‘కబాలి’ సినిమాలో డ్రగ్స్ సరఫరానే ఇతివృత్తంగా తీసుకుని నిర్మించారు. అదే సినీ నిర్మాత ఈ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం విశేషం.

Related posts

హలో బ్రదర్: బెత్తం దెబ్బలు వర్సెస్ మరణ శిక్ష

Satyam NEWS

నవంబర్‌ 26న సంయుక్త కిసాన్‌ మోర్చా ఛలో రాజ్‌భవన్‌

Bhavani

పబ్జి గేమ్ కు అలవాటు పడి పై గదిలో ఆత్మహత్య

Satyam NEWS

Leave a Comment