28.7 C
Hyderabad
April 26, 2024 10: 27 AM
Slider సినిమా

క్షీరసాగర మథనం: అవాంతరాల హాలాహలం అనంతరమే ఆనందం

#khsirasagara madhamam

సాఫ్ట్వేర్ ఇంజినీర్ టర్నడ్ డెబ్యూ డైరెక్టర్-బహుముఖ ప్రతిభాశాలి అనిల్ పంగులూరి

“ఐరావతం, కామధేను, కల్పవృక్షం” వంటివాటితో సరిపెట్టుకున్నా… హాలాహలం ఉద్భవించినప్పుడు భయపడి ఆగిపోయినా… “అమృతం” ఆవిర్భవించేది కాదు. కష్టాలకు భయపడి ఆగిపోతే జీవన మకరందాన్ని ఆస్వాదించలేం… జీవితంలో ఏమీ సాదించలేమన్నదే మా “క్షీర సాగర మథనం” కథా సారాంశం” అంటున్నారు సాఫ్ట్ వేర్ రంగం నుంచి సినీ రంగంలో దర్శకుడుగా అరంగేట్రం చేస్తున్న ‘బహుముఖ ప్రతిభాశాలి’ అనిల్ పంగులూరి.

ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన పలు సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఓ ఇరవై మంది మిత్రుల ప్రోత్సాహంతో… అనిల్ పంగులూరి తెరకెక్కించిన “క్షీర సాగర మథనం” రేపు (ఆగస్టు 6) ప్రేక్షకుల ముందుకు వస్తోంది. శేఖర్ కమ్ముల ‘హ్యాపీ డేస్’కి సీక్వెల్ లాంటి ఈ చిత్రం సాఫ్ట్వేర్ వాళ్లనే కాకుండా… సెన్సిబిలిటీస్ ఉన్న ప్రతి ఒక్కరినీ అమితంగా ఆకట్టుకుంటుందని అనిల్ అంటున్నారు.

ఈ చిత్రం చూసి, ఎంతగానో మెచ్చిన స్టార్ ప్రొడ్యూసర్ శరత్ మరార్ తనకు నైతికంగా ఎంతో మద్దతు ఇచ్చారని, ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిదని తెలిపారు. ఏడు పాత్రల తాలూకు భావోద్వేగ సంఘర్షణల మధనమే “క్షీర సాగర మథనం” అంటున్నారు. ఈ చిత్ర విజయంపై ఎంతో ధీమాగా ఉన్న ఈ ఒంగోలు వాసి… తన తదుపరి చిత్రం కోసం ఇప్పటికే కధ-కథనాలు సిద్ధం చేసుకోవడంతోపాటు… ప్రి-ప్రొడక్షన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకోవడం విశేషం.

మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించిన ఈ చిత్రసంలో అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర  ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!

Related posts

Road Widening: వనపర్తిలో రోడ్ల విస్తరణ పనులకు శ్రీకారం

Satyam NEWS

రేషన్ దుకాణం ప్రాంతాలను పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్

Satyam NEWS

ఎవ‌రి తాలూక షేర్ ఎంతో తెలుసు…ఫెడరల్ సిస్టంలో…!

Satyam NEWS

Leave a Comment