28.7 C
Hyderabad
May 6, 2024 09: 27 AM
Slider ఆదిలాబాద్

ఆదివాసులపై అటవీ శాఖ అధికారుల దాడిని ప్రతిఘటిస్తాం

#tudumdebba

మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలం, కొయపొశ గుడంలో ఆదివాసులపై ఫారెస్ట్ అధికారుల ధమనకాండను తుడుం దెబ్బ తీవ్రంగా ఖండించింది. అటవీ శాఖ అధికారుల దాడికి వ్యతిరేకంగా తుడుం దెబ్బ ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా అధ్వర్యంలో మరొక దశ అటవీ పోరాటానికి శ్రీకారం చుడతామని తుడుం దెబ్బ ఆదిలాబాదు జిల్లా కమిటీ అధ్యక్షులు గోడం గణేష్ హెచ్చరించారు.

అన్ని జిల్లాల అటవీ శాఖ కార్యాలయాలను ముట్టడిస్తామని ఆయన తెలిపారు. అటవీ సాగుదారులు కొయపొశ గుడెం ఆదివాసీ మహిళలు మొన్ననే ఆదిలాబాదు జిల్లా జైలుకు వెళ్లి వచ్చి నెల రోజులు గడవక ముందే మరొక సారి అటవీ శాఖ అధికారులు ఆదివాసులపై దాడి చేయడం వెనక ముఖ్యమంత్రి KCR హస్తం ఉందని భావిస్తున్నామని ఆయన అన్నారు. 

జాన్ నెలలో కొయపొశ గుడెం నుంచి ITDA  కార్యాలయం  ఉట్నూరు వరకు ఆదివాసులు పాదయాత్రగా వచ్చి PO ITDA కి వినతి పత్రం ఇచ్చామని ఆయన గుర్తు చేశారు. ఈ సమస్యను పై అధికారులకు తెలిపి సమస్యను వెంటనే పరిష్కారం చేస్తానని తెలపడం జరిగింది. కానీ, అధికారుల నిర్లక్ష్యం వలనే ఆదివాసులపై దాడి జరిగింది. దీని వెనక  కేంద్ర  రాష్ట్ర   ప్రభుత్వాలు ఉన్నాయని ఆయన అన్నారు. కావాలనే ఆదివాసులపై కక్ష గట్టి అడవి నుండి అటవీ భూముల నుండి బలవంతంగా వెళ్లగొడుతున్నారని ఆయన అన్నారు.

Related posts

కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బీరం

Satyam NEWS

మిషన్ భగీరథ పై రెండు మాటలు మాట్లాడుతున్న బిజెపి

Satyam NEWS

ఈనెల 19 నుంచి తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ సమ్మె

Satyam NEWS

Leave a Comment