29.7 C
Hyderabad
May 2, 2024 04: 36 AM
Slider నల్గొండ

నిత్యావసర వస్తువుల నియంత్రణ లో ప్రభుత్వాలు విఫలం

#IDWA

నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు నియంత్రించటంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి గా విఫలం అయ్యాయని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు జిట్ట సరోజ విమర్శించారు.

నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో బుధవారం నాడు మహిళా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన దీక్ష కు ఆమె హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా ధరలు పెంచడం వల్ల ప్రజలపై పడుతున్న భారాలతో కూడిన ప్లేకార్డ్ లతో నిరసన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలపై అన్ని రకాల పన్నులు వెయ్యడం అన్యాయంగా ఉంది అని అన్నారు.

బాలికలకు, మహిళలకు పౌష్టికాహారం అందేలా ప్రజా పంపిణీ వ్యవస్థను ప్రతిష్ఠ పర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.  ధనిక వర్గాల ప్రయోజనాలను కాపాడే పాలకవర్గాలు నిత్యావసర వస్తువుల , కూరగాయల ధరలను తక్షణమే తగ్గించకపోతే ఐద్వా ఆధ్వర్యంలో పెద్ద యెత్తున ఆందోళన లు ఉధృతంగా చేస్తామని ఆమె  హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్ళు జిట్ట అనిత, లక్ష్మి, మణెమ్మ, అండాలు, సరిత, రమాదేవి, ముత్తమ్మ, రేణుక, యాదమ్మ, మల్లమ్మ, నాగమ్మ, పద్మ, నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

డెత్‌లెస్ పోయెట్…

Satyam NEWS

సుక్మా ఎన్ కౌంటర్ అమరుడు జవాన్ జగదీష్ మృతదేహం.. నగరానికి..!

Satyam NEWS

నో ఎస్క్యూజ్:కూతుర్ని రేప్ చేసి త‌ల్లిని కొట్టి చంపేశారు

Satyam NEWS

Leave a Comment