27.7 C
Hyderabad
May 14, 2024 05: 49 AM
Slider ఆదిలాబాద్

ఆదిలాబాద్ లో రైతు బిల్లు వ్యతిరేక ప్రదర్శన

#AdilabadProtest

బిజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లు కు వ్యతిరేకంగా ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లోని అఖిలపక్షం, రైతు సంఘాల ఆధ్వర్యంలో పట్టణం లో ర్యాలి నిర్వహించారు.

కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని  నిరసన వ్యక్తం చేశారు. రైతు కు ఉపయోగపడని ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలనే నినాదాలతో హోరెత్తించారు.

రైతు బిల్లు ఎత్తివేయాలని బిల్లు పత్రాలను కలెక్టర్ కార్యాలయం ఎదుట తగులబెట్టారు. కలెక్టర్ కార్యాలయం లోనికి పోనీయకుండా పోలీసులు అడ్డుపడడంతో తోపులాట జరిగి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

పోలీసులు కొంత మందికే లోనికి వెళ్లడానికి అనుమతి ఇవ్వడంతో అఖిలపక్షం, రైతు సంఘాల నాయకులు లోనికి వెళ్లి RDO కు వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ సాజిద్ ఖాన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బిల్లు రైతులకు అన్యాయం చేసే విధంగా ఉందని అన్నారు. 

ఈ బిల్లు కార్పోరేట్ సంస్థలకు మేలు కలిగేలా ఈ రైతు బిల్లును తీర్చిదిద్దారని పేర్కొన్నారు. కాంట్రాక్టు విధానంతో రైతులు తమ సొంత భూమిలో కూడా కూలీలుగా పని చేయాల్సిన దుస్థితి వస్తుందన్నారు.

వెంటనే ఈ బిల్లును ఉపసంహరించకుంటే దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.

Related posts

మంత్రి బొత్స సత్యనారాయణ పని అయిపోయింది

Satyam NEWS

అద‌నంగా ఐపీఎస్ అధికారుల‌ను కేటాయించండి

Satyam NEWS

రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు: తీవ్ర ఉద్రిక్తత

Satyam NEWS

Leave a Comment