33.7 C
Hyderabad
April 29, 2024 00: 59 AM
Slider వరంగల్

కొత్త రెవెన్యూ చట్టానికి సబ్బండ వర్గల పబ్బతి

#ErrabellyDayakarrao

తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం తెచ్చిన కొత్త రెవన్యూ చట్టానికి తెలంగాణ సబ్బండ ప్రజలు పబ్బతి పడు తున్నరని తెలంగాణ రాష్ర్ట పంచాయతీరాజ్, గ్రామీణాభివద్ధి,గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు.

శుక్రవారం పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలంలో కొత్త రెవన్యూ చట్టానికి మద్దతుగా కొండూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి దయాకర్ రావు క్షీరాభిషేకం చేశారు.

అనంతరం ట్రాక్టర్లు,కాడేడ్లతో ఐదు కిలో మీటర్ల్ సంఘీ బావ ర్యాలీనిర్వహించి ప్రాయణ ప్రారంగణంలో సమావేశం నిర్వహించారు. పాలకుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించారు. ఆసుపత్రిలో రోగులకు అందితున్న సేవాలను అడిగితెలుసుకున్నారు.

కరోనా పరీక్షలు కేంద్రంలో వసతులు సమీక్షించారు. కలెక్టర్ తో ఫో్న్ లో మాట్లాడి ఆసుపత్రికి నిధులుకేటాయించాలని ఆదేశించారు. తొర్రూర్ లో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి సంక్షేమ పథకా లను ప్రజలకు వివరించాలని తెలిపారు.

దేశానికి అన్నం పెట్టిన రైతున్నను రాజు చేయుటకు ప్రభుత్వం సంక్షేమమే ద్యేయంగా కేసీఆర్ పనిచేస్తున్నరనిన్నారు. త్వరలో జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలలో తెలంగాణ పార్టీ అభ్యర్ధిని అఖండ విజయం సాధించుటకు కార్యకర్తలు కలసి కట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

పలు పార్టీల నుండి వచ్చిన వారికి టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పిపార్టీలోకి ఆహ్వనించారు. ఈ కార్యక్రమాలలో ఎంపీపీలు, జడ్పీటి లు, సర్పంచ్ లు,పార్టీల మండల అధ్యక్షులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కంఝవాలా కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి

Satyam NEWS

సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోన్న మెగాస్టార్‌ చిరంజీవి ‘ఆచార్య’ టీజర్‌

Satyam NEWS

సూర్యాపేటలో జూన్ 2 సంబురాలకు సర్వం సిద్ధం

Bhavani

Leave a Comment