29.2 C
Hyderabad
October 10, 2024 19: 05 PM
Slider జాతీయం

మహారాష్ట్రలో రేపే బలపరీక్షకు సుప్రీం ఆదేశం

supreem court

మహారాష్ట్రలో ఎమ్మెల్యేలను కొనేందుకా అన్నట్లు డిసెంబర్ 7వ తేదీ వరకూ బలనిరూపణకు అవకాశం ఇచ్చిన ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ ఖోషియారీ నిర్ణయానికి విరుద్ధంగా రేపే బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపు సాయంత్రం ఐదు గంటల లోపు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తన బలాన్ని నిరూపించుకోవాలని నిర్ద్వందంగా సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎక్కువ సమయం ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఈ విధంగా తీర్పు చెప్పడం మహారాష్ట్ర బిజెపికి తీరని దెబ్బ. మహరాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై సుప్రీం కోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ రేపు సాయంత్రం ఐదు గంటల లోగా బలనిరూపణ చేసుకోవాలని స్పష్టం చేసింది. బలపరీక్షను ప్రత్యక్ష ప్రసారం చేయాలని కోరింది. రేపు సాయంత్రం ఐదు గంటలలోపు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలని వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని ఆదేశించింది. రహస్య ఓటింగ్‌ లేదని నిర్వహించరాదని విస్పష్టంగా చెప్పింది. జస్టిస్‌ ఎన్వీ రమణ తీర్పును చదివి వినిపించారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన పేర్కొన్నారు. జస్టీస్‌ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాలతో కూడిన సుప్రీం బెంచ్‌ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. మరోవైపు సుప్రీం నిర్ణయంతో ఎన్సీపీ, శివసేన, కాంగ్రెస్‌ శిబిరంలో ఉత్తేజం నెలకొంది. బలపరీక్ష జరిగే వరకూ తమ ఎమ్మెల్యేలు చేజారకుండా మూడు పార్టీలు చర్యలు చేపట్టగా, ఎన్సీపీ చీలిక వర్గ ఎమ్మెల్యేలు, స్వతంత్రుల మద్దతుతో బలపరీక్షలో బయటపడాలని బీజేపీ యోచిస్తోంది. మహా తీర్పును కాంగ్రెస్‌ సహా విపక్షాలు స్వాగతించాయి. ఇది చారిత్రాత్మక తీర్పని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ అభివర్ణించగా, ప్రజాస్వామ్య విజయమని శివసేన హర్షం వ్యక్తం చేసింది.

Related posts

ప్రోటోకాల్:మహా శివరాత్రి కి మంత్రి అల్లోలకు ఆహ్వానం

Satyam NEWS

జనసేన మెగా బ్లడ్ డోనేషన్ క్యాంప్..

Bhavani

విశాఖ విమానాశ్రయంలో ముఖ్యమంత్రికి ఘనస్వాగతం

Satyam NEWS

Leave a Comment