21.7 C
Hyderabad
December 2, 2023 04: 56 AM
Slider అనంతపురం

మంత్రి పెద్దిరెడ్డికి నిరసన సెగ

#Minister Peddireddy

వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కి నిరసన సెగ తగిలింది. సాగునీటి సలహా మండలి సమావేశానికి వచ్చిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనంతపురం కలెక్టరేట్ వద్ద టిడిపి నేతలు కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కలెక్టరేట్ వద్ద టిడిపి నేతలు రిలే దీక్ష చేపట్టారు. రిలే దీక్షా శిబిరం నుంచి బయటికి వచ్చి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో స్పెషల్ పార్టీ పోలీసులు రిలే దీక్షా శిబిరం వైపు దూసుకెళ్లారు. ఈ సందర్భంగా టిడిపి నేతలకు డీఎస్పీ ప్రసాద్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీనికి టీడీపీ నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

Related posts

కటీ పతంగ్

Satyam NEWS

బెజ‌వాడ క‌న‌క దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న డిప్యూటీ స్పీక‌ర్ కోల‌గ‌ట్ల‌

Satyam NEWS

అంబర్ పేట్ లో ఫ్రీ హెల్త్ క్యాంప్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!