బిచ్కుంద మండల కేంద్రంలో జుక్కల్ శాసన సభ్యుడు హన్మంత్ షిండే కు తన పేరుతో కూడిన PRTU డైరీ ని అందచేశారు. డైరీని చూసిన ఎమ్మెల్యే నా సర్వీస్ లో చాలా డైరీలను చూశాను గాని నా పేరుతో ఉన్న డైరీని అందుకోవడం చాలా అద్భుతంగా ఉందని అన్నారు.
డైరీని ఈ విధంగా రూపొందించిన జిల్లా అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కుషాల్, డైరీని అందించిన PRTU నాయకులకు అభినందిచారు.PRTU సంఘం తమ హక్కుల కొరకే కాకుండా సమాజానికి ఉపయోగపడే ఎన్నో కార్యక్రమంలో భాగస్వామ్యం పంచుకొంటున్నదని తెలియజేశారు. తన స్వంత గ్రామంలో ఉన్న పాఠశాల ను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన PRTU నాయకుల ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో బిచ్కుంద మండల PRTU అధ్యక్షుడు ఇర్షద్ , ప్రధాన కార్యదర్శి చంద్రకాంత్, జిల్లా వైస్ ప్రెసిడెంట్ సీమ శ్రీనివాస్, మండల కార్యదర్శి హైమద్, DOS గంగారం, సీనియర్ PRTU నాయకులు వేద్ భూషణ్, మద్నూర్ ఉర్దూ మీడియం HM బుజ్జయ్య, మండల RSS అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్ పాల్గొన్నారు.