ఇంటర్ పరీక్ష ఫలితాల అనంతరం ఫెయిలైన విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డ విషయం తెలిసిందే. ఫెయిల్ అయితే ఇక భవిష్యత్తు ఉండదన్న అపోహలు, అనవసర ఆందోళనలతో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.
భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు, ఆసక్తి ఉన్న రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ విద్యాశాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
తెలంగాణలోని 194 ప్రభుత్వ మోడల్ పాఠశాలలోని 19000 మంది విద్యార్థులకు సైకోమెట్రిక్ టెస్ట్ లు రెండు నెలల క్రితం నిర్వహించారు. ఈ టెస్ట్ ద్వారా పదో తరగతి విద్యార్థుల ఆసక్తి రంగాలను గుర్తించారు. జిల్లాల వారీగా ఆ ఫలితాలను ప్రభుత్వం ప్రకటించనుంది. సైకోమెట్రిక్ విద్యను ప్రవేశపెట్టనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.