గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో ప్రజా పంపిణీకి వెళ్లాల్సిన రాగులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తుండగా పట్టుకున్నారు. ప్రజలకు చేరాల్సిన వీటిని అక్రమార్కులు బ్లాక్ లో అమ్ముకోవాలని చూశారు. ఆటో లో తరలిస్తుండగా ప్రజాపంపిణీ కి చేరాల్సిన రాగులు దొరికాయి. ఇవి మొత్తం 3 క్విటాళ్ల ఉంటాయి.
వీటిని వెంగళరెడ్డినగర్ లో చౌకధరడిపో నుండి ఆటో లో తరలిస్తున్నారని తేలింది. దాంతో ఆటో డ్రైవర్ ను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ప్రజాపంపిణీ రాగుల ను రెవెన్యూశాఖ కు అప్పగించారు. కేసు దర్యాప్తులో ఉంది.