29.7 C
Hyderabad
May 3, 2024 03: 54 AM
Slider మహబూబ్ నగర్

29న వనపర్తిలో 125 వాహనాల బహిరంగ వేలం

వనపర్తి జిల్లా పరిధిలోని పోలీస్టేషన్ లలో వివిధ కారణాలతో పట్టుబడి ఎవరూ గుర్తించని వాహనాలను అక్టోబర్ 29 తేదిన బహిరంగ వేలం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ కె.అపూర్వరావు తెలిపారు. ఆసక్తి గలవారు ఆధార్ కార్డ్ జిరాక్స్ కాఫీతో వేలంలో పాల్గొనాలని కోరారు. కేసులలో, పోలీసుల తనిఖిలలో పట్టుబడ్డ ఈ ఎబండెన్డ్ వాహనాలను బహిరంగ వేలంలో కొనుగోలు చేసుకోవచ్చు. ఇలాంటివి మొత్తం 125 వాహనాలు ఉన్నాయి. అక్టోబర్ 29 వ తేదిన ఉదయం 11:00 గంటలకు జిల్లా కేంద్రంలోని నాగవరంలో ఉన్న పోలీసు సాయుధ దళ కార్యాలయం ఆవరణంలో బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ వాహనాలను సంబంధిత వ్యక్తులు గుర్తించి తీసుకెళ్ళేందుకు ఇచ్చిన గడువు ముగిసినందున అక్టోబర్ 29 న తేదిన బహిరంగా వేలం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వాహనాలకు సంబంధించిన వివరాలను అధికారిక జిల్లా పోలీసు ఫేస్బుక్, ట్విట్టర్ సామాజిక మాధ్యమాలలో ఉంచినట్లు ఎస్పీ తెలిపారు.

ఇందులో 2 నాలుగు చక్రాల వాహనాలు, 6 మూడు ఆటోలు, 117 ద్విచక్ర వాహనాలున్నట్లు తెలిపారు. వీటిని జిల్లా కేంద్రం లోని నాగవరంలోని సాయుధ దళ కార్యాలయం ఆవరణంలో ఉంచడం జరిగిందని చెప్పారు. వేలంలో పాల్గొనదల్చిన వారు వాహనాలను ముందుగా చూసుకునే వెసులుబాటు కల్పించడం జరిగిందని, బహిరంగా వేలంలో పాల్గొనదల్చిన వ ఆధార్ కార్డు జిరాక్స్ సమర్పించి బహిరంగ వేలంలో పాల్గొనాలని ఇతర వివరాలకు సాయుదదళ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకట్ ను సంప్రదించాలని జిల్లా ఎస్పీ తెలిపారు.

వివరాలకు 8498974640, 7901153006 లను సంప్రదించాలని కోరారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యంన్యూస్.నెట్

Related posts

తెలంగాణ ఉద్యోగ సంఘాలతో ఆర్టీసీ జేఏసీ సమావేశం

Satyam NEWS

ఆంధ్రప్రదేశ్ అంథకారం కాబోతోంది: టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల

Satyam NEWS

వైయస్సార్ సిపి ఎజెండా  పేద ప్రజల సంక్షేమం

Satyam NEWS

Leave a Comment