40.2 C
Hyderabad
April 26, 2024 14: 31 PM
Slider కడప

ఆంధ్రప్రదేశ్ అంథకారం కాబోతోంది: టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల

#bhatyala

కడప జిల్లా రాజంపేట నియోజకవర్గానికి ఈశాన్యం లో ఉన్న నందలూరు మండలం పొత్తపి గ్రామంలో సోమవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చంగల్ రాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా వైసిపి ప్రభుత్వం తీసుకుంటున్న వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నవ రత్నాల పథకాలతో పాటు దశ పథకం జగనన్న చీకటి పథకం ప్రవేశ పెట్టారని ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బొగ్గు కొరత వల్ల విద్యుత్ సంక్షోభం ఏర్పడిందని, దానిని కప్పి పుచ్చుకోవడం కోసం మిగిలిన రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి ఉందని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారన్నారు. మిగిలిన రాష్ట్రాల్లో వేరు మన రాష్ట్రంలో పరిస్థితి వేరని, కేవలం జగన్మోహన్ రెడ్డి ముందు చూపు కొరవడటం వల్ల నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంధకారంలోకి వెళ్లబోతోందని విమర్శించారు.

ట్రూఅప్ చార్జీల పేరుతో గత రెండు నెలలుగా వినియోగదారుల నుండి అధిక విద్యుత్ చార్జీలను వసూలు చేయడo జరుగుతుంది. హైకోర్టు ఈ విషయాన్ని టేకప్ చేయడంతో పి.ఆర్.సి మరల పబ్లిక్ హియరింగ్ చేస్తామని, దానిని తాత్కాలికo గా నిలుపుదల చేస్తున్నామన్నారని అన్నారు. అయితే ఈ రెండు నెలలుగా వసూలు చేసిన ట్రూఅప్ చార్జీలను వినియోగదారులకు తిరిగి చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు.

కరెంటు కొనుగోలులో కంభకోణం

గత రెండు సంవత్సరాల్లో విద్యుత్ బహిరంగ మార్కెట్లో యూనిట్ ఛార్జ్ రూ. 3.12పై. దొరుకుతూ ఉంటే, బయట మార్కెట్ లో 6 రూపాయలు నుండి 11 రూపాయల వరకు కొనుగోలు చేసి వేల కోట్ల కుంభకోణానికి పాల్పడుతూన్నారని ఆయన మండి పడ్డారు.

అదే విధంగా బొగ్గు కొరత కారణంగా ఇంట్లో ఏసీ లు ఆపుకోండి అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం సిగ్గుచేటు,హాస్యాస్పదం అన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఉండేది. చంద్రబాబు నాయుడు కరెంటు గురించి, బొగ్గు నిల్వలను ప్రతి రోజు మానిటర్ చేయడం జరిగేదని అన్నారు.

జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత నాణ్యమైన విద్యుత్ కొరత ఏర్పడింది. అదే విధంగా అనధికారికంగా కోతలు విధిస్తున్నా రన్నారు.భవిష్యత్తు లో అధికారికంగా 2 – 3 గంటలు కోతలు విధిస్తారు, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈవేళ సింగరేణికి చెలించాల్సిన బకాయిలు చెల్లించి బొగ్గును కొనుగోలు చేయాల్సిన పరిస్థితని, కానీ గత రెండు సంవత్సరాలుగా 7 ఉత్పత్తి కేంద్రాలను మూసి వేయడం జరిగిందని.ల్, మీ కమీషన్ల కోసం బయట మార్కెట్ నుండి విద్యుత్ అధిక రేట్లుకు కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఈ పర్యటనలో గ్రామ ప్రజలు వైసిపి ప్రభుత్వంలో కరెంట్ ఒక్కటే కాకుండా ప్రతి నిత్యవసర వస్తువులు సామాన్యులకి అధిక భారంగా మారాయని తెలియజేస్తూ వైసీపీ ప్రభుత్వం కంటే టిడిపి ప్రభుత్వంలో ప్రతిదీ ఎన్నో రెట్లు సామాన్యులకి చాలా అందుబాటులో ఉంటూ తక్కువ ధరలో ప్రజానీకానికి దొరికేదని ప్రజలు తమ ఆవేదనను పర్యటనలో ఉన్న బత్యాల దృష్టికి తీసుకువచ్చారు.

ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ యాదవ మహాసభ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ బాబు యాదవ్, టి.యన్.ఎస్.ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, రాష్ట్ర తెలుగురైతు కార్యదర్శి కడవకూడ తిరుపతయ్య, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి అద్దేపల్లి ప్రతాప్ రాజు,పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కోవూరు సుబ్రహ్మణ్యం నాయుడు, జంగంశెట్టి సుబ్బయ్య, మాజీ ఏ.యం.సి ఉప చైర్మన్ తాటి సుబ్బారాయుడు, పసుపులేటి ప్రవీణ్, ఎన్నారై రమణ,విజయభాస్కర్, నువ్వుల రమణయ్య, చుక్క యానాది ,సురేష్ ,సుధాకర్, శీను, గంధం గంగాధర,శివ, భువనబోయిన నర్సయ్య, గుమ్మల్ల ప్రసాద్, పుల్లయ్య, కొండయ్య, వెంకటయ్య, రాము, ఎన్. వెంకటరమణ, కుమార్,మురళీ, వెంకటసుబ్బయ్య,నారాయణ, శ్రీనాథ్, నాగి వెంకటసుబ్బయ్య, పగడాల శ్రీరాములు,నాగి సుబ్బయ్య,నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమెరికా జర్నలిస్టుకు దీటుగా సమాధానం చెప్పిన మోడీ ప్రభుత్వం

Bhavani

వాన నీరు బయటకు వెళ్లక మురిగిపోతున్న గ్రామాలు

Satyam NEWS

భత్యాల పోలీసులు,అధికారులను విమర్శిస్తే సహించేది లేదు

Satyam NEWS

Leave a Comment