కేంద్రంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలోని బిజెపి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నదని భువనగిరి పార్లమెంట్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. NRC , CAA లకు వ్యతిరేకంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు నల్లగొండ పట్టణంలో సభ నిర్వహించారు.
ఈ సభలో ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో నిరుద్యోగం పెరిగిందన్నారు. మతతత్వం పేరుతో దాడులు జరిగాయని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్రజల సమస్యలను పట్టించుకోకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన సాగిస్తున్నదని ఆయన విమర్శించారు.
NRC,CAA లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన సాగిస్తున్నా కూడా మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ చట్టాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అని ఆయన ఈ సందర్భంగా అన్నారు. పార్లమెంట్ లో కూడా NRC,CAA లకు వ్యతిరేకంగా పోరాటం సాగిస్తామని స్పష్టం చేశారు.
