42.2 C
Hyderabad
May 3, 2024 18: 40 PM
Slider ప్రత్యేకం

రఘురామపై ‘లాకప్ దాడి’ కేసులో జగన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

#APHighCourt

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు పై లాకప్ లో జరిగిన దాడి తదనంతర పరిణామాలు ఆంధ్రప్రదేశ్ సిఐడికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

తమ ఉత్తర్వులను ఏపి సిఐడి అమలు చేయకపోవడంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీరియస్ అయింది.

హైకోర్ట్, మెజిస్ట్రేట్ ఇచ్చిన ఉత్తర్వులను ఎందుకు అమలు చేయలేదని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రాష్ట్ర హైకోర్ట్ నిలదీసింది.

మెజిస్ట్రేట్ కోర్ట్ ఆర్డర్స్ ను రద్దు చేయాలని ప్రభుత్వం వేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై రాష్ట్ర హైకోర్ట్ లో నేడు విచారణ జరిగింది.

ఈ సందర్భంగా ప్రభుత్వంపై సుమోటోగా కోర్ట్ ధిక్కరణ కింద నోటీసులు ఇవ్వాలని హైకోర్టు నిర్ణయించింది.

మధ్యాహ్నం 12 గంటలకు మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలని తాము ఆదేశించినా సాయంత్రం 6 గంటల వరకు ఎందుకు ఇవ్వలేదని కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అదే విధంగా రాత్రి 11 గంటలకు ఆర్డర్ కాపీ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదని కూడా హైకోర్ట్ నిలదీసింది.

సీఐడీ అడిషనల్ డీజీ, స్టేషన్ హౌస్ ఆఫీసర్ కు కోర్టు ధిక్కరణ నోటీసులివ్వాలని హై కోర్ట్ ఆదేశించింది.

వారికి కోర్ట్ ధిక్కారం కింద వెంటనే నోటీసులు జారీ చేయాలని జ్యుడీషియల్ రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేయడంతో ఒక్క సారిగా ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

పౌరుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు కోర్టులు ఇలాగే స్పందిస్తాయని కూడా హైకోర్ట్ వ్యాఖ్యానించింది.

Related posts

జగన్ ప్రభుత్వం.. మైనార్టీ లకు ఏం చేసింది..?

Bhavani

విజయనగరంలో పొంచి ఉన్న ప్రమాదం… పట్టించుకోని అధికార యంత్రాంగం..!

Satyam NEWS

మోపిదేవి లో శ్రీ ధన్వంతరి సహిత మృత్యుంజయ హోమం

Satyam NEWS

Leave a Comment