31.7 C
Hyderabad
May 2, 2024 07: 08 AM
Slider కడప

Protest: క్వారంటైన్ లో అన్నం కూడా పెట్టడం లేదు

#Punjab Students

క్వారంటైన్ లో ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించడం లేదని పంజాబ్ నుంచి వచ్చిన బిటెక్ విద్యార్థులు కడప లోని కె.ఎస్.ఆర్.ఎమ్ క్వారంటైన్ సెంటర్ లో నిరసన చేశారు. ఈ నెల 12, 16 తేదీల్లో 47 మంది విద్యార్థులు పంజాబ్ నుంచి కడప జిల్లాకు వచ్చారు.

కోవిడ్ 19 రూల్స్ ప్రకారం వారికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో వారికి కరోనా నెగిటివ్  రావడంతో  స్థానిక కె.ఎస్.ఆర్.ఎమ్ గణేష్ హాస్టల్లో  14 రోజులు కామన్ క్వారంటైన్ కు అధికారులు పంపారు. రెండు రోజుల నుంచి కనీసం మెనూ ప్రకారం కూడా ఆహారం అందించడంలో అధికారులు విఫలమైనారని విద్యార్థులు అంటున్నారు.

పంజాబ్ లో ప్రభుత్వం హోం క్వారంటైన్ కు సిఫార్సు చేస్తే ఇక్కడ ఆంధ్ర ప్రభుత్వం తమను నిర్బంధించిందని వారన్నారు. తమకు జరుగుతున్న అన్యాయం పై వారు అధికారులతో గొడవకు దిగారు. కనీసం మాకు కడుపు నిండా అన్నం పెట్టడం లేదని విద్యార్థులు వాపోయారు. కనీసం శానిటేజర్ కూడా ఇవ్వలేదంటూ నిరసన వ్యక్తం చేశారు. దయచేసి తమను హోమ్ క్వారేటైన్ కు పంపించాలని అధికారులను వేడుకున్నారు. అంతవరకు భోజనాలను చెయ్యమని నిరసనకు దిగారు.

Related posts

ప్రకృతి పగబట్టిందని పంటకు నిప్పు పెట్టుకున్న రైతులు

Satyam NEWS

వైద్య కళాశాలలో తరగతులను ప్రారంభించనున్న సి‌ఎం

Murali Krishna

శానిటేషన్ వర్కర్స్ కు కరోనా రక్షకాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment