29.7 C
Hyderabad
May 3, 2024 03: 06 AM
Slider ఖమ్మం

తెలంగాణ వడ్లు కొనాల్సిందే

purchase telangana paddy

రాష్ట్రంలో యాసంగిలో రైతులు పండించిన వడ్లను కొనల్సిందే అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు. రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త దీక్షలో భాగంగా ఖమ్మం నియోజకవర్గం రఘునాథపాలెం మండలం మంచుకొండ ప్రధాన రహదారిపై మండల పార్టీ అద్వర్యంలో చేపట్టిన ఆందోళనలో మంత్రి పువ్వాడ పాల్గోని మాట్లాడుతూ తెలంగాణ రైతాంగం పండించిన వడ్లు కొనాలని రైతులపై కక్ష ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ వడ్లు కొనుగోలులో కేంద్రం దొంగాట ఆడుతున్న విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. బిజెపి ఢిల్లీలో ఒకమాట  గల్లీలో ఒకమాట మాట్లాడుతుందని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే వక్రబుద్దిని రైతులపై చూపించడం సిగ్గుచేటన్నారు. ఆహార భద్రత చట్టం ప్రకారం రాష్ట్ర అవసరాలు పోను కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాలలని అది కేంద్రం బాధ్యత అని స్పష్టం చేశారు.

దేశంలో విపత్కర పరిస్థితులు వస్తే కేంద్రం ఆహార నిల్వల్ని రాష్ట్రాల నుండి కొనుగోలు చేసి పెట్టాలని రాజ్యాంగ బద్దంగా ఉన్న విషయం తెలియకపోవడం విచారకరమన్నారు. ఎన్నో దశాబ్దాలుగా ఇదే తరహా నడుస్తుందని, కానీ ఈ రెండేళ్ళ నుండి తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ కక్ష పెట్టుకొని పేచీలు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణలో యాసంగిలో వడ్లు పట్టిస్తే నూకలు ఎక్కువ వస్తాయి అది సహజం అని , దిగుబడి తగ్గుతది అందుకే ఇక్కడ బాయిల్ చేస్తాం ఆది కేంద్రంకు తెలుసునని,  గతంలో బాయిల్డ్ రైస్ తీసుకొని ఇపుడు ఎందుకు వద్దు అంటున్నారు..??. అని ప్రశ్నించారు. ఇది కక్ష్యా సాధింపు చర్య కాదా ఆని ప్రశ్నించారు.

ఢిల్లీకి వెళ్లి మంత్రుల బృందం పీయూష్ గోయెల్ ని కలిస్తే అవమానకరంగా మాట్లాడారని, ఇది చాలా బాధాకరం అని , తెలంగాణ ప్రజలకు నూకలు తినే అలవాటు చేయండి అనటం సిగ్గుచేటన్నారు. రైతులను కించపరిచే విధంగా చాలా హీనంగా, ఘోరంగా అవమానిస్తున్నారని,  రైతులు ఎక్కడైనా రైతులే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. వరి వేస్తే ప్రతి గింజ కొనే బాధ్యత బిజేపిది అని బండి సంజయ్ ప్రకటించారని,  రైతులకు హామీ ఇచ్చారని, ప్రతి గింజా కొంటామన్నరని గుర్తు చేశారు.  వడ్లు కొనం అనటమే సమస్య ఆని, అందుకే తెలంగాణ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తు రోడ్డు మీదకు వచ్చే పరిస్థితిని కేంద్రం తీసుకువచ్చిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పంటలు విస్తారంగా పండిస్తున్నారంటే కారణం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి ప్రధన కారణమని వివరించారు. కేంద ప్రభుత్వం అందించే ఎరువులపై 20శాతం సబ్సిడీ ని తగ్గించారని తద్వారా ఎరువుల ధర పెరిగిందన్నారు. ఇప్పటికైనా కేంద్రం దిగివచ్చి తెలంగాణ వడ్లు కొనాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు చవిచూస్తారని హెచ్చరించారు.

Related posts

“ఉజ్జ్వ‌ల భార‌త్ – ఉజ్జ్వ‌ల భ‌విష్య‌త్” పేరుతో విద్యుత్ ఉత్స‌వాలు

Satyam NEWS

తెలంగాణలోని 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలి

Bhavani

ఈటెలకు మతి స్థిమితం లేదు

Satyam NEWS

Leave a Comment