39.2 C
Hyderabad
May 3, 2024 11: 57 AM
Slider విజయనగరం

విజ‌య‌న‌గ‌రంలో రాజా సాహెబ్ పీవీజీ రాజు వ‌ర్దంతి…!

#pvgraju

విజ‌య‌న‌గ‌రం అంటే  దాదాపు రెండువేల సంవ‌త్స‌రపు కాలం  రాజుల కోట‌, ఆ నాటి కాలంలో నిర్మించిన గంట‌స్థంభం, పూరాత‌న  భ‌వ‌న క‌ట్టడాలు ఇప్ప‌టికీ ద‌ర్శ‌న‌మిస్తాయి. ఈ సోదేంటి చెబుతున్నాన‌ని అనుకోకండి….విజ‌య‌న‌గ‌ర రాజైన పూస‌పాటివిజ‌య‌రామ‌గ‌జ‌ప‌తి రాజు వ‌ర్ధంతి  సంద‌ర్భంగా  ఆయ‌న స్మ‌రిస్తూ…ఆయ‌న  జ్ఙాప‌కాల‌ను ఓ సారి గుర్తు తెచ్చుకునే కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది…క్ష‌త్రియ ప‌రిష‌త్.

ఈ మేర‌కు న‌గ‌రంలోని ఆయోద్యామైదానం స‌మీపంలో క్షత్రియ‌భ‌వ‌న్ లోఉన్న పీవీజీ విగ్ర‌హానికి కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తిరాజు పూల‌దండ‌లు వేసి నివాళులు అర్పించారు.ఆయ‌న‌తో పాటు ఎంఎల్సీ ర‌ఘువ‌ర్మ‌,పెనుమ‌త్స సురేష్ కుమార్ లు కూడా పూల‌దండ‌లు వేసి నివాళులు అర్పించారు. ఈసంద‌ర్బంగా స్వర్గీయ డాక్టర్ పి పి. జి రాజు  వర్ధంతి సందర్భంగా  క్షత్రియ యూత్ పరిషత్ ఆధ్వర్యంలో  ఎన్వీఎన్ బ్లడ్ బాంక్ సహకారం తో నిర్వహించిన రక్తదాన శిబిరంలో 95 మంది పాల్గొని రక్తదానం చేశారు.

అనంతరం వక్తలు మాట్లాడుతూ పీవీజీ రాజు ఎనలేని సేవలు చేశారని  1950 ఏడాదిలోనే పేద విద్యార్థులు చదువుకునేందుకు వసతి కొరకు హాస్టలు నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు విద్య వైద్య రంగాలకు ఎముక లేని చేయిగా విరాళాలు ఇచ్చి విజయనగరాన్ని విద్యాలనగరం గా మార్చిన ఘనత డా.పీవీజీ రాజు గారిదేన‌న్నారు. 14 నవంబర్ 14, 1995 ఏడాది పీవీజీ రాజు స్వర్గస్తులైన ప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆయన  జయంతి కి వర్ధంతికి సేవా కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగటం శుభపరిణామమని తెలియజేశారు.

ఈ సంద‌ర్బంగా క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో సుమారు 20 మంది పేద క్షత్రియులు ఆరోగ్య సంరక్షణ మరియు వైద్య ఖర్చుల నిమిత్తం ఒక లక్షా 50 వేల రూపాయలు ఇవ్వటం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో క్షత్రియ పరిషత్ అధ్యక్షులు దంతులూరి సీతారామరాజు, కార్యదర్శి రాంబాబు క్షత్రియ యూత్ పరిషత్ అధ్యక్షులు  శేఖర్ రాజు, కార్యదర్శి లక్ష్మీపతి వర్మ ఆధ్వర్యంలో కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ఈ కార్యక్రమంలో సాగి శివాజీ రాజు,జీఏవీ రామరాజు,జీ.రామరాజు, ఐ వి పి రాజు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు

Related posts

తుమ్మలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి

Bhavani

నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంచిన IKR ఫౌండేషన్

Satyam NEWS

25 దేవాలయాలకు పాలక మండళ్లు

Satyam NEWS

Leave a Comment