28.7 C
Hyderabad
May 6, 2024 09: 48 AM
Slider హైదరాబాద్

కనెక్టివిటీ, హాస్పిటాలిటీ, లా అండ్​ ఆర్డర్​ అంశాల్లో హైదరాబాద్​ భేష్​

#pvnrexpresshighway

పివిఎన్​ఆర్​ డౌన్​ ర్యాంప్​ ను ప్రారంభించిన మంత్రి తలసాని

రాజధాని హైదరాబాద్​ నగరం జనాభా పెరుగుదల, ఉపాధి అవకాశాలకు అనుగుణంగా అన్ని రకాల మౌలిక సదుపాయాలను ఒనగూర్చుకుంటుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్​ అన్నారు. శనివారం ఉదయం  పివిఎన్​ఆర్​ ఎక్స్​ప్రెస్​ హైవే పైన లక్ష్మీనగర్​ వద్ద సుమారు రూ.5 కోట్ల వ్యయంతో హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ డెవలప్​ మెంట్​ అథారిటీ(హెచ్ఎండిఏ) నిర్మించిన డౌన్​ ర్యాంప్​ ను మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్,  మేయర్​ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, ఎం.ఎస్​.ప్రభాకర్​, ఎమ్మెల్యే  కౌసర్​ మోహిద్దీన్​, డిప్యూటీ మేయర్​ ఎం.శ్రీలత శోభన్​రెడ్డి, గుడిమల్కాపూర్​ కార్పొరేటర్​ దేవర కరుణాకర్​ లతో కలిసి​ మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్​ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సంకల్పంతో  తెలంగాణ రాష్ట్రం నేడు  దేశానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు విజన్​ తో  హైదరాబాద్​ జంటనగరాల రూపురేఖల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు.

కనెక్టివిటీ, హాస్పిటాలిటీ, లా అండ్​ ఆర్డర్​ అంశాల్లో  హైదరాబాద్​ నగరం దేశంలోని ఇతర నగరాలకు ధీటుగా ఉందన్నారు.  మరో  రెండు, మూడు దశాబ్దాల భవిష్యత్తును,  ప్రజల అవసరాలను దృష్టిలో  ఉంచుకుని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ గారు హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ ఏరియా పరిధిలో మౌళిక వసతుల కల్పన కోసం ప్రత్యేక కార్యచరణతో  ముందుకు సాగుతున్నారని వివరించారు.

ప్రణాళికలను రూపొందించడంలోను,  రోడ్లు, ఫ్లై ఓవర్​ బ్రిడ్జీలను నిర్మించి ప్రజలకుల అందుబాటులోకి తీసుకువస్తున్న  హెచ్ఎండిఏ యంత్రాంగాన్ని మంత్రి శ్రీనివాసయాదవ్​ అభినందించారు. కార్యక్రమంలో హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్​ లిమిటెడ్​(హెచ్ జిసిఎల్​) మేనేజింగ్​ డైరెక్టర్​ సంతోష్​ ఐఏఎస్​, హెచ్ఎండిఏ చీఫ్​ ఇంజినీర్​ బిఎల్​ఎన్​ రెడ్డి, సెక్రెటరీ పి.చంద్రయ్య, సూపరింటెండెంటింగ్​ ఇంజినీర్స్​ యూసుఫ్​ హుస్సేన్​, శ్రీమతి పరంజ్యోతి, డౌన్​ ర్యాంప్​ నిర్మాణంలో భాగస్వామ్యమైన ఇంజినీర్లు రజిత, గౌతమి, విద్యాసాగర్​, వెంకటేశ్​, అశుతోష్​ కుమార్​ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మార్పీఎస్ నేత కందుల రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఆళ్ళ నాని

Satyam NEWS

కృష్ణాష్టమికి గోపాలుడి తోపాటు గోవులను పూజిస్తే సకల పాపాలు పోతాయి

Satyam NEWS

Analysis: వలసపోతున్న దేశ అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment